ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. జాగ్రత్త సుమా..!

చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది.. కానీ ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు.. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. 

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. జాగ్రత్త సుమా..!
Tea On Empty Stomach


చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది.. కానీ ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు.. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. 

ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగడం వల్ల పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.. ముఖ్యంగా కనీసం నీరు కూడా తాగకుండా టీ తాగే అలవాటు ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. కొన్నాళ్ళ పాటు ఇది అలవాటు అయిన తర్వాత మార్చుకోవటం కష్టం అంటూ ఇలానే కొనసాగిస్తూ ఉంటారు.. అయితే ఇలా చేయడం వల్ల నోటికు సంబంధించిన సమస్యలతో పాటు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది..

నిజానికి ఉదయాన్నే నిద్ర లేవగానే లీటర్ నీళ్లు తాగాలి.. దీనివల్ల పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది.. అలా కాకుండా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లా ఆల్కలీన్ అసమతుల్యత ఏర్పడుతుంది.. అలాగే రాత్రి దాదాపు ఎనిమిది గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటాము.. నీరు కూడా తాగము.. కానీ ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగడం వల్ల శరీరం మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది.. అలాగే రోజంతా చిరాకుగా, వికారంగా అనిపిస్తుంది..

ఇలా ఉదయాన్నే టీ తాగడం వల్ల కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్తి సమస్య వేధిస్తుందని తెలుస్తుంది.. అంతేకాకుండా కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి.. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు అస్సలు ఇలా చేయకూడదు.. టి అనేది ఆహార పదార్థాలలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది.. దీనివల్ల ఐరన్ సమస్య తలెత్తి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.. 

అలాగే రోజులో ఎక్కువసార్లు టీ తాగడం కూడా అలవాటు చేసుకోకూడదు.. కేవలం తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే రోజుకు ఒకసారి టీ తాగాలి.. అది కూడా మధ్యాహ్నం మూడు గంటలకు టీ తాగడం సరైన పద్ధతిని నిపుణులు చెబుతున్నారు.. అలాగే ఉదయాన్నే టీ తాగకుండా ఉండలేం అనుకునేవారు గ్రీన్ టీను కానీ.. అల్లం టీనీ కానీ ఎంచుకోవడం వల్ల లాభం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.