ఉదయం లేవగానే.. తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతున్నారా..? చాలా ప్రమాదం

చాలా మందికి ఉదయం లేవగానే.. గోరువెచ్చని నీళ్లల్లో.. తేనె, నిమ్మరసం కలుపుకోని తాగడం అలవాటుగా ఉంటుంది. దీనివల్ల పొట్టతగ్గుతుందని, ఆరోగ్యానికి మంచిదని అంటారు. కానీ ఖాళీ కడుపుతో ఇలా చేయొద్దని నిపుణులు అంటున్నారు. అదే కాదు. ఉదయం పూట పండ్లు కూడా తినొద్దట. 

ఉదయం లేవగానే.. తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతున్నారా..? చాలా ప్రమాదం


చాలా మందికి ఉదయం లేవగానే.. గోరువెచ్చని నీళ్లల్లో.. తేనె, నిమ్మరసం కలుపుకోని తాగడం అలవాటుగా ఉంటుంది. దీనివల్ల పొట్టతగ్గుతుందని, ఆరోగ్యానికి మంచిదని అంటారు. కానీ ఖాళీ కడుపుతో ఇలా చేయొద్దని నిపుణులు అంటున్నారు. అదే కాదు. ఉదయం పూట పండ్లు కూడా తినొద్దట. ప్రతిరోజూ ఉదయం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు రాత్రంతా నిద్రలో ఉపవాసం ఉన్నట్లే. ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత మీ జీవక్రియలు సక్రమంగా జరగాలంటే శక్తి అవసరం అవుతుంది. ఆ శక్తి టిఫెన్‌ ద్వారా అందుతుంది. అల్పాహారం అనేది రోజులో మీరు చేసే మొదటి భోజనం. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఖాళీ కడుపుతో తింటున్నారా లేదా అంతకు ముందు ఏదైనా తీసుకున్నారా అనేది కూడా ముఖ్యమే.
Honey Lemon Juice : తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే మంచిదే.. దీన్ని ఎలా  తాగాలంటే..?

నిమ్మకాయ నీరు- తేనె

ఇది చాలా మంచిదని భావిస్తారు. ముఖ్యంగా ఇది కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుందని భావించి చాలా మంది దీనిని తీసుకుంటారు. అయితే తేనెలో చక్కెర కంటే ఎక్కువ కేలరీలు ఎక్కువ ఉంటాయని మీకు తెలుసా? తేనే గ్లైసెమిక్ ఇండెక్స్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజుల్లో ఎటువంటి సంకలనాలు లేని స్వచ్ఛమైన తేనె దొరకడం అంటే కష్టమే. చాలా మంది తేనె పేరుతో చక్కెర, రైస్ సిరప్‌ను కలిపి కల్తీ చేస్తున్నారు. ఇదే స్వచ్ఛమైన తేనేగా భావించి చాలా మంది తీసుకుంటారు. కానీ, ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఫలితంగా రోజంతా ఎక్కువ ఆకలి కోరికలు ఉంటాయి. మీరు అనుకున్న ఫలితాలు ప్రతికూలంగా వస్తాయి.

పండ్లు

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే. అయితే పండ్లను ఎప్పుడంటే అప్పుడు తినొద్దు.. ముఖ్యంగా ఉదయం పూట ఒక గిన్నెడు పండ్లను తినడం మంచి అలవాటు అని అనుకుంటాము, కానీ పొషకాహార నిపుణులు కేవలం పండ్లు మాత్రమే తినడం మంచి అలవాటు కాదంటున్నారు. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇలా చేస్తే గంటలోనే ఆకలి వేస్తుంది. అలాగే కొన్ని సిట్రస్ పండ్లు ఖాళీ కడుపుతో తింటే కూడా ఎసిడిటీకి దారి తీస్తుంది.

టీ లేదా కాఫీ

చాలా మంది దినచర్య ఒక కప్పు టీ లేదా కాఫీతో మొదలవుతుంది. కానీ, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లాలు ఏర్పడతాయి మరియు అది మీ పొట్టను కలవరపెడుతుంది , జీర్ణ సమస్యలను సృష్టిస్తుంది.

తియ్యని అల్పాహారం

చాలా మంది ఉదయం పూట బ్రెడ్- జామ్‌తో తమ అల్పాహారాన్ని ముగిస్తారు. కానీ ఉదయం పూట తియ్యదనంతో కూడిన అల్పాహారం చేస్తే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి, అలాగే త్వరగా పడిపోతాయి. దీని వలన మీకు శక్తి తక్కువగా ఉంటుంది, మీ శరీరం కార్బోహైడ్రేట్ల కోసం మరింత ఆరాటపడుతుంది. కాబట్టి తియ్యటి అల్పాహారానికి బదులు ఏదైనా బలమైన రుచికరమైన అల్పాహారం చేయడం ఉత్తమం.
ఉదయం టిఫెన్‌ చేయడం చాలా మంచి పద్ధతి.. కడుపునిండా టిఫెన్‌ చేస్తే.. మధ్యాహ్నం తక్కువగా తింటారు. అన్నం తక్కువగా తినాలి.. టిఫెన్‌ గట్టిగా లాగించాలి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.