Drumstick : మునగ తో ఏ సమస్యలు దూరం చేసుకోవచ్చంటే.. !

Drumstick తొ ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి.. అలాగే ఈ చెట్టులో ప్రతి ఒక్క భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనికి సంబంధించిన మునగ కాయలు, మునగ ఆకులు సైతం పలు రోగాలని నయంచేయడానికి ఉపయోగపడతాయి.

Drumstick  :  మునగ తో ఏ సమస్యలు దూరం చేసుకోవచ్చంటే.. !


Drumstick తొ ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి.. అలాగే ఈ చెట్టులో ప్రతి ఒక్క భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనికి సంబంధించిన మునగ కాయలు, మునగ ఆకులు సైతం పలు రోగాలని నయం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని తరుచు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తుంది.. 

మునగలో విటమిన్ సి, ఇ, పొటాషియం, ఐరన్ వంటివి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో కాల్షియం స్థాయిలు కూడా మెండుగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఐరన్ పలు రకాల సమస్యలని దూరం చేస్తుంది. అందుకే వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి సంబంధించిన ఎన్నో సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు..

ఏ పని చేసినా చాలా అలసటగా అనిపిస్తూ.. దేని మీద ఏకాగ్రత కుదరకపోతే శరీరంలో ఐరన్ లోపించిందేమో తెలుసుకోవాలి. ఇలాంటి సమయంలోనే మునగకు సంబంధించిన పదార్థాలు తరచు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. మునక్కాయలను తీసుకున్న లేక మునగ ఆకులను తీసుకున్న ప్రయోజనాలు ఉంటాయి.. అలాగే వీటి వలన ఏ ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి అంటే.. 

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి మునక్కాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే మెగ్నీషియం రక్తనాళాలలో ఉండే కొవ్వును తగ్గించడంలో ముందుంటుంది. దీనివలన రక్తం సరఫరా సజావుగా సాగుతుంది.. అలాగే మునగలు ఉండే ఔషధాలు రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాలను తగ్గిస్తాయి దీని వలన రక్త సరఫరా మెరుగుపడి గుండెకు రక్తసంపద సక్రమంగా జరుగుతుంది. దీనివలన గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.. 

Odissa Maharashtra Moringa Drumstick, Rs 45/kilogram Nilesh Trading ...

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహం సమస్య అదుపులో ఉంటుంది. అంతేకాకుండా వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో పెరగవు. అందుకే మధుమేహం సమస్య ఉన్నవారు ఎలాంటి అభ్యంతరం లేకుండా వీటిని తీసుకోవచ్చు.. 

అలాగే ఇందులో విటమిన్ ఏ, బి, పోలిక్ యాసిడ్ వంటివి అధికంగా ఉంటాయి. దీని వలన రోజంతా చురుకుగా ఉండటమే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలు సైతం దరిచేరవు.. అలాగే ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు ఊడే సమస్య ఉన్నవారు వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుంది.. అలాగే ఇందులో ఉండే లక్షణాలు థైరాయిడ్ ను అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా శరీరానికి సంబంధించి వచ్చే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులను అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.