Dry ginger : శొంఠిని ముఖానికి వాడితే.. మంగు మచ్చలు పోతాయి తెలుసా..?

Dry ginger : అల్లం అంటే ఆరోగ్యానికి మాత్రమే మంచిదని చాలా మంది అనుకుంటారు. దీన్ని వంటల్లో వాడుతుంటారు. జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు కషాయంలో వాడతారు. కానీ అల్లాన్ని కూడా ముఖానికి రాసుకోవచ్చని మీకు తెలుసా..?

Dry ginger : శొంఠిని ముఖానికి వాడితే.. మంగు మచ్చలు పోతాయి తెలుసా..?
Dry ginger for Pigmentation


Dry ginger : అల్లం అంటే ఆరోగ్యానికి మాత్రమే మంచిదని చాలా మంది అనుకుంటారు. దీన్ని వంటల్లో వాడుతుంటారు. జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు కషాయంలో వాడతారు. కానీ అల్లాన్ని కూడా ముఖానికి రాసుకోవచ్చని మీకు తెలుసా..? అల్లంతో చర్మ సౌందర్య పెంచుకోవచ్చు. ఎండబెట్టిన అల్లంతో వచ్చే శొంఠిని ముఖానికి రాసుకుంటే మంచి లాభాలు పొందుతారు. 

బ‌రువును త‌గ్గించ‌డంలో శొంఠి పొడి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇవే కాకుండా శొంఠి పొడితో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రెండు టేబుల్ స్పూన్ల శొంఠి పొడిని నాలుగు క‌ప్పుల నీళ్ల‌లో వేసి ఈ నీటిని రెండు క‌ప్పులు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. ఇలా మ‌రిగించిన నీటిలో రెండు టీ స్పూన్ల‌ లావెండ‌ర్ నూనెను వేసి నాలుగు గంట‌ల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. నాలుగు గంట‌ల త‌రువాత దూదితో ఈ నీటిని తీసుకుంటూ చ‌ర్మంపై రాసుక‌ని 20 నిమిషాల త‌రువాత నీటితో క‌డిగండి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం రంగు మార‌డ‌మే కాకుండా నిగారింపును, కాంతిని సొంతం చేసుకుంటుంద‌ని, చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా మ‌రిగించిన నీటిని ఫ్రిజ్ లోనే ఉంచి మ‌నం నిల్వ చేసుకోవ‌చ్చు. చ‌ర్మ సౌంద‌ర్యానికి హానిని క‌లిగించే ర‌సాయ‌నాల‌ను వాడడానికి బ‌దులుగా శొంఠి పొడిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్పభ్రావాలు క‌ల‌గ‌కుండా చ‌ర్మ సౌంద‌ర్యంతోపాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

శొంఠి పొడిని నీళ్ల‌లో లేదా అన్నం క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల ఆక‌లి శ‌క్తి పెర‌గ‌డం, అజీర్తి, జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు, వికారం, వాంతులతోపాటు జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. శొంఠి చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శొంఠి పొడి దీర్ఘకాలిక అజీర్ణం వల్ల కడుపు నొప్పి , కడుపులో అసౌకర్యం నుండి ఉపశమనం పొందుతుంది. గర్భిణీ స్త్రీలలో వికారం , ఉదయం అనారోగ్యం , లక్షణాలతో వ్యవహరించడంలో శొంఠి పొడి ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.