Beauty Tips : మీ పెదాలు ఎర్రగా మారాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..!

Beauty Tips : కళ్ల కింద నల్లటి వలయాలు, నల్లగా ఉన్న పేదాలు ఉంటే.. మీరు ఎంత తెల్లగా ఉన్నా ఏం బాగుండదు కదా..! మరీ పేదాలు నల్లగా ఉంటే ఈ చిట్కాలను ట్రే చేయండి. చక్కగా ఎర్రగా మారతాయి. దొండపండు లాంటి పేదాలు కావలంటే

Beauty Tips : మీ పెదాలు ఎర్రగా మారాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..!


Beauty Tips : కళ్లు, పెదాలు ఇవి బాగుంటే.. ఎవరి ముఖం అయినా అందంగా కనిపిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలు, నల్లగా ఉన్న పేదాలు ఉంటే.. మీరు ఎంత తెల్లగా ఉన్నా ఏం బాగుండదు కదా..! మరీ పేదాలు నల్లగా ఉంటే ఈ చిట్కాలను ట్రే చేయండి. చక్కగా ఎర్రగా మారతాయి. దొండపండు లాంటి పేదాలు కావలంటే పాటించేయండి మరీ..! హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పెద‌వులు న‌ల్ల‌గా మార‌తాయి.

నిమ్మర‌సంలో పంచ‌దార‌ను, కొబ్బరి నూనెను క‌లిపి పెద‌వుల‌పై సున్నితంగా రాసి 15 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద‌వుల‌పై ఉండే న‌లుపు, మృత క‌ణాలు తొల‌గిపోయి పెద‌వులు అందంగా క‌న‌బ‌డ‌తాయి.

పాల మీగ‌డ‌లో బీట్ రూట్ ర‌సాన్ని క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెదవుల‌కు రాసుకుని 10 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద‌వులు ఎర్ర‌గా మెరుస్తూ ఉంటాయి. 

గంధాన్ని, పసుపును క‌లిపి పెద‌వుల‌కు రాయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. 

గులాబి రేకుల‌ను, తేనెను క‌లిపి మెత్త‌గా పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెద‌వులపై రాసి 20 నిమిషాల త‌రువాత క‌డిగేయ‌డం వ‌ల్ల పెద‌వుల‌పై ఉండే న‌లుపు తొల‌గిపోతుంది.

రాత్రి ప‌డుకునే ముందు పెద‌వుల‌కు పాల మీగ‌డ రాసి ఉద‌యాన్నే క‌డిగేయ‌డం వ‌ల్ల పెద‌వులపై ఉండే న‌లుపు త‌గ్గి పెద‌వులు పొడిబార‌కుండా ఉంటాయి. 

బొప్పాయి పండును మెత్త‌గా చేసి ఆ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు రాసి 20 నిమిషాల త‌రువాత క‌డిగేయ‌డం వ‌ల్ల పెద‌వుల న‌లుపు త‌గ్గుతుంది. 

ఒక టీ స్పూన్ స్ట్రాబెర్రీ ర‌సంలో 2 టీ స్పూన్ల పెట్రోలియం జెల్లీని క‌లిపి పెద‌వుల‌కు రాసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. 

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల పెద‌వుల న‌లుపు త‌గ్గ‌డంతోపాటు పెద‌వులు స‌హ‌జసిద్ధంగా ఎర్ర‌గా క‌న‌బ‌డ‌తాయి. అంతేకాకుండా పెద‌వులు పొడిబార‌కుండా ఆరోగ్యంగా ఉంటాయి. లిప్‌స్టిక్‌ను ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. చీప్‌ క్వాలిటీవి వాడితే మీ పెదాలు అప్పటివరకూ ఎర్రగా ఉంటాయోమో కానీ.. ఆ తర్వాత నల్లగా మారిపోతాయి.. కళ్లకు, పెదాలకు కాస్మోటిక్స్‌ కాస్త ఖరీదైనవి రసాయనాలు తక్కువగా ఉన్నవే ఎంచుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.