శృంగారంలో పాల్గొనేముందు ఇవి తినండి.. రెచ్చిపోతారు..!

ఈరోజుల్లో శృంగార జీవితాన్ని సాఫీగా అనుభవించేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.. ఏజ్‌లో ఉన్నప్పుడు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ టైమ్‌లో శృంగారంలో పాల్గొనే అవకాశం ఉండదు.. ఒకవేళ అలాంటి అవకాశాలు వచ్చి గర్ల్‌ఫ్రెండ్‌తో కమిట్‌ అయితే తర్వతా కెరీర్‌ పక్కదారి పడుతుంది

శృంగారంలో పాల్గొనేముందు ఇవి తినండి.. రెచ్చిపోతారు..!


ఈరోజుల్లో శృంగార జీవితాన్ని సాఫీగా అనుభవించేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు.. ఏజ్‌లో ఉన్నప్పుడు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ టైమ్‌లో శృంగారంలో పాల్గొనే అవకాశం ఉండదు.. ఒకవేళ అలాంటి అవకాశాలు వచ్చి గర్ల్‌ఫ్రెండ్‌తో కమిట్‌ అయితే తర్వతా కెరీర్‌ పక్కదారి పడుతుంది. చక్కగా సెటిల్‌ అయి, పెళ్లి చేసుకుని భార్యతో చేసే టైమ్‌కు మనకు ఒత్తిడి, చిరాకులు వచ్చేసి తూతుమంత్రంగా పనికానిచేస్తారు. ఫలితంగా సంతానలేమి, అసంతృప్తి అన్నీ వెంటాడుతుంటాయి. మాన‌సిక ఒత్తిడి, డిప్రషన్‌ నుంచి బయటపడాలంటే.. శృంగారంలో త‌ర‌చూ పాల్గొనాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. 

romance benefits, Romance : శృంగారంతో ఈ సమస్యలన్నీ దూరం.. - importance of  romance to a woman - Samayam Telugu

అరటిపండు

శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.  

పీనట్ బటర్

పీన‌ట్ బ‌ట‌ర్ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డొప‌మైన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో శృంగారంలో పాల్గొనాల‌నే కోరిక పెరుగుతుంది. ఇందులో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల శృంగార‌ సామర్థ్యం పెరగడంతోపాటు వీర్యంలో నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్‌ను తినేందుకు చాలా మంది అయిష్టతను ప్రదర్శిస్తారు. కానీ దీన్ని తినడం వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ శృంగార పరంగా అనేక లాభాలు కలుగుతాయి. శృంగార‌ సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది. బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవాలి. నేరుగా తిన‌డం ఇష్టం లేక‌పోతే జ్యూస్ రూపంలో అయినా రోజూ క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు.

ఎర్ర ద్రాక్ష‌

నిత్యం ఒక గుప్పెడు ఎర్ర ద్రాక్ష పండ్లను తింటే చాలు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార పరంగా వచ్చే సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల మగవారిలో వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది.  

ఓట్ మీల్

నిత్యం ఒక కప్పు ఓట్ మీల్‌ను తింటే మగవారిలో శృంగార సామర్థ్యం డబుల్ అవుతుంది. వీర్య నాణ్యత పెరుగుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. 

కాఫీ

శృంగారానికి ముందు దంపతులిద్దరూ ఒక కప్పు కాఫీ తాగితే ఇక ఒత్తిడి, ఆందోళన మాయమవడమే కాదు, ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఈ విష‌యాన్ని సైంటిస్టులే చెబుతున్నారు.

బీన్స్‌

బీన్స్‌లో ప్రోటీన్స్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా స్త్రీ, పురుషులు తమకు కలిగే శృంగార సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇవి కూడా..!
నిమ్మజాతి పండ్లు, బ్రౌన్ రైస్, యాపిల్స్, సోయాబీన్, డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయ విత్తనాలు, మొక్కజొన్న. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.