Fishes for healthy heart : రెండుసార్లు తింటే ఏ గుండె సమస్యలు దరిచేరకుండా చేసే సేర్విన్గ్స్ చేపల గురించి తెలుసా..!

Fish : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. గుండెకు సంబంధించిన ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నారు. అయితే తాజాగా జరిగిన అధ్యయనాలు కొన్ని రకాల చేపలు తీసుకోవడం వల్ల గుండె వ్యాధులు రావని తెలుస్తోంది.

Fishes for healthy heart : రెండుసార్లు తింటే ఏ గుండె సమస్యలు దరిచేరకుండా చేసే సేర్విన్గ్స్ చేపల గురించి తెలుసా..!
Eat this fish for healthy heart


Healthy heart with Fish : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. గుండెకు సంబంధించిన ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నారు. అయితే తాజాగా జరిగిన అధ్యయనాలు కొన్ని రకాల చేపలు తీసుకోవడం వల్ల గుండె వ్యాధులు రావని తెలుస్తోంది.

తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జరిపిన అధ్యయనాలు చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలకు దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా వారానికి రెండు నుంచి మూడుసార్లు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే చేపలను తీసుకోవాలని చెబుతోంది. ఇందులో ఉండే పోషకాలు గుండెకు మేలు చేస్తాయని తెలుస్తోంది.

ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ శరీరంలో ఉండే మంటను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారు తరచూ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది..



ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే అలా సేర్విన్గ్స్ చేపలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.  శరీరంలో రక్తం గడ్డ కట్టడం తగ్గటమే కాకుండా గుండెకు సంబంధించిన స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. గుండె స్పందనను క్రమబద్ధీకరించడమే కాకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటు నుంచి రక్షిస్తుంది.

సీ ఫుడ్ అన్నిటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అయితే కొన్నిటిలో తక్కువగా ఉన్నప్పటికీ చేపల్లో అధికంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా సేర్విన్గ్స్ చేపల్లో అధికంగా ఉంటాయి. వీటితోపాటు సాల్మాన్, సాల్డిన్, అట్లాంటిక్ మాకేరే, లేట్ ట్రౌట్ వంటి చేపల్లో సైతం ఈ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని స్ట్రేషన్ చేసిన అధ్యయనాల్లో వారానికి కనీసం 8 ఔన్సుల ఒమేగా త్రీ ఫిష్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు..

అలాగే గర్భిణీలు సైతం వీటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలకు కూడా వీటిని అందించాలి.  అయితే రెండు సంవత్సరాలు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఇవ్వటంలో జాగ్రత్త వహించడం అవసరం..

చేపలను డీప్ ఫ్రై చేసి తీసుకోవటం కన్నా గ్రిల్ చేయటం బాయిలింగ్ చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు అన్ని అందే అవకాశం ఉంటుంది..

చాలామందిలో సముద్రంలో దొరికే చేపలు వ్యర్థ పదార్థాలను తింటాయని వాటిలో పాదరసం అధిక స్థాయిలో ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా గట్టి నమ్మకం. అయితే చేపలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలతో పోలిస్తే వచ్చే నష్టాలు చాలా తక్కువనే చెప్పాలి.

చేపలను తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఉండే టాక్సిన్స్ గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లల మీద వారి మెదడు నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాదరసం సహజంగా వాతావరణం లో తక్కువ ఉన్నప్పటికీ పారిశ్రామిక కాలుష్యాలు సరస్సులు, నదులు వంటి వాటి వలన ఇది ఎక్కువగా సముద్రంలో చేరుతుంది. అయితే కొన్ని రకాల చేపలు మాత్రం అధిక స్థాయిలో పాదరసాన్ని కలిగి ఉంటాయని తెలుస్తోంది. అవి ముఖ్యంగా షార్క్, టైల్ ఫిష్, స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్ వంటివి ఉంటాయి..

అలాగే చేపలు తీసుకోవడంలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. చేపలు పెంచినప్పుడు ఎన్నో రకాల వ్యర్థ పదార్థాలతో పాటు మందులు అధిక శాతం ఉపయోగిస్తారని ఆరోగ్యానికి హాని చేస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజమైన విషయం కాదు. వాణిజ్యంగా పెంచే చేపల్లో కలిగే కలుషితాలు శరీరానికి చేసే నష్టం కన్నా తీసుకోవడం వల్ల కలిగే మేలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఓమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో గర్భాశ‌య‌ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా  ఫ్యాటీ యాసిడ్స్ చేపలను తీసుకోవడం వల్ల మేలే జరుగుతుందని చెప్పవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.