డ్రైనట్స్ , డ్రై ఫ్రూట్స్ తింటే కొవ్వు పెరుగుతుందా..? ఏది బాగా తినొచ్చు.? ఏది తగ్గించి తినాలి??

డైట్ ఫాలో అయ్యేవాళ్లు డ్రై ఫ్రూట్స్ dry fruits, డ్రై నట్స్ dry nuts ఎక్కువగా తింటున్నారు. ఎండువిత్తనాలు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెప్తారు..కానీ చాలామందిలో..ఇవి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు అని

డ్రైనట్స్ , డ్రై ఫ్రూట్స్ తింటే కొవ్వు పెరుగుతుందా..? ఏది బాగా తినొచ్చు.? ఏది తగ్గించి తినాలి??


ఈ రోజుల్లో డైట్ ఫాలో అయ్యేవాళ్లు డ్రై ఫ్రూట్స్ dry fruits, డ్రై నట్స్ dry nuts ఎక్కువగా తింటున్నారు. ఎండువిత్తనాలు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెప్తారు..కానీ చాలామందిలో..ఇవి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు అని ఒక అపోహ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజం. డ్రైనట్స్ అనేవి ఒబిసిటి, ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారు తినకూడదు, లైఫ్ లో ముట్టుకోకూడదు అనేది కేవలం అపోహ. నిజమే వీటిల్లో కొవ్వు శాతం ఉంటుంది. అంతమాత్రనా తింటే కొవ్వు పెరుగుతుందా అంటే..? డ్రై నట్స్ మానే అంత చెడ్డవి కాదు. వీటివల్ల HDL Cholesterol గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా రావాలన్నా, LDL Cholesterol బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, మంచి కండపుష్టి బలం రావాలన్నా డ్రైనట్స్ తినొచ్చు. అయితే తగు మోతాదులో తినాలి. డ్రైనట్స్ , డ్రై ఫ్రూట్స్ లో ఏది బాగా తినొచ్చు.? ఏది తగ్గించి తినాలి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం..

డ్రై ఫ్రూట్స్ విషయంలో కావల్సినన్ని తినొచ్చు.. ఖర్జూరాలు, కిస్ మిస్, ఎండుద్రాక్ష, అంజీరా,యాప్రికాట్స్, ఆల్ బక్రా, చెర్రీస్ ఇలాంటివి అన్నీ ఎన్నైనా తినొచ్చు. బేసిక్ గానే ఇవి ఎక్కువ తినలేం, కొద్దిగ తినగానే.. ఇక చాలు అనే ఫీలింగ్ వస్తుంది. ఇవి బరువు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. ఇవి తినటం వల్ల బ్లడ్ ఫార్మేషన్ కు, ఇన్ స్టెంట్ ఎనర్జీకి, సూక్ష్మపోషకాలను ఇవ్వడానికి, అతి ఆకలిని తగ్గించడానికి చాలా విధాలుగా ఉపయోగపడతాయి. 

డ్రైనట్స్ విషయానికి వస్తే..బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాలు, వాల్ నట్స్, పుచ్చగింజలు, గుమ్మడిగింజలు, పొద్దుతిరుగుడుపప్పులు, పీనట్స్, పైన్ నట్స్, బ్రెజిల్ నట్స్ ఇవి అన్నీ అందరి ఆరోగ్యానికి మంచిదే, అయితే కొవ్వు ఎక్కువగా ఉన్నవారు, బరువు తగ్గాలనుకున్నవారు వీటిని తినొచ్చు కాకపోతే తక్కువ మోతాదులో తినాలి. ఇవి తినేప్పుడు రైస్ క్వాంటిటీ, ఇతర కార్ఫోహైడ్రేట్స్ పదార్థాలను కాస్త తగ్గించుకోవాలి. అప్పుడు కాలరీస్ బ్యాలెన్స్ అవుతాయి. వెయిట్ పెరగరు, మంచి ఫుడ్ తిన్నట్లు అవుతుంది. ఇలా తినగలిగితే ఎవరికైనా మంచిదే.


డ్రైనట్స్ తినేప్పుడు నానపెట్టి తొక్కతీసే తినాలా?

నానపెట్టుకుని తినటం అనేది డ్రైనట్స్ విషయంలో కచ్చితంగా చేయాలి. మనలో చాలామందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే..ఎవరు ఇంటికి వచ్చినా, లేదా మనం వెళ్లినా..డ్రైనట్స్ టేబుల్ మీద పెట్టి తినమంటుంటారు. బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి. మనం అలా మాటల్లో పడి తినేస్తాం. అలా ఎండుగా ఉన్నప్పుడు తినకూడదు. ఆయిలీగా ఉంటాయి. 50-60శాతం ఫ్యాట్ ఉంటుంది. అలా తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది, త్వరగా డైజెషన్ కావు అరగకుండా అందులో పోషకాలు మళ్లీ మలం ద్వారా వచ్చేస్తాయి. బాడీకీ పట్టవు అనమాట. అంతఖర్చు పెట్టి కొనుక్కొచ్చినవి..మన బాడీకీ పట్టాలంటే..నానపెట్టే తినాలి. 7-9 గంటలపాటు నానితే.. మంచిది. తొక్కతీసేసి తింటే ఒరిజనల్ గా వాటి రుచి బాగా తెలుస్తుంది. తొక్కతోనే తినటం వల్ల కాస్త వగరుగా, కండ్రగా అనిపిస్తుంది. మంచిగా ఎంజాయ్ చేయాలంటే..నానపెట్టి తొక్కతీసి తినండి..ఇవి ఇలా నానపెట్టినప్పుడు నూనె ఫామ్ నుంచి..పాల ఫామ్ లోకి మారుతుంది. ఎండిన విత్తనాలు ఏది గ్రైండ్ చేసినా ఆయిల్ వస్తుంది..అదే నానపెట్టిన వాటిని గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. సింపుల్ లాజిక్..కాబట్టి నానపెట్టుకునే తినాలి. 

డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇవి మెత్తగానే ఉంటాయి. ఇవి ఫ్రష్ గా తినొచ్చు. ఇవి నానపెడితే..చప్పబడతాయి. కాబట్టి డైరెక్టుగానే తినాలి.

డ్రైనట్స్ లో ఏది తినటం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి

కొంతమందికి అతి ఆకలి వేస్తుంది. ఇలాంటి వాళ్లకి ఆకలి తగ్గించాలంటే.. కార్భోహైడ్రేట్స్ ఉండేవి మానేయాలి. వాల్ నట్స్ తింటే ఇలాంటి వారు బరువు తగ్గుతారని సైంటిఫిక్ గా కూడా నిరూపించబడింది. మెదడుకు మంచిది.,కొవ్వు కరగడానికి మంచిది. వీటిలో 67శాతం ఫ్యాట్ ఉంటుంది. 687 క్యాలరీలు ఉంటాయి. మేకమాంసం కంటే ఎక్కువ. ఇవి స్లోగా డైజెషన్ అవుతాయి. ఆకలి త్వరగా అవ్వదు. తిండిమీద వాంఛను పోగొడుతుంది. అస్తమానం ఆహారం తినే వాళ్లు ఈ వాల్ నట్స్ బాగా ఉపయోగపడతాయి.

జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్యాట్ మెటబాలిజంను రెగ్యులేట్ చేస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. 5-6 జీడిపప్పులు తినటం తప్పేంకాదు..సన్నగా ఉన్నావారు, గర్భీణీలు, బాలింతలు, ఆటలు ఆడేవారు అయితే 20-25 అయినా తినొచ్చు. 

బాదంపప్పులో మోనోసాట్యురేటెడ్ ఫ్యాట్, యాంటిఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్యాట్ రెగ్యులేట్ చేసే మెకానిజం బాడీలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.

బ్రెజిల్ నట్స్ లో L-ఆర్జిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి బాగా పనికొస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు. 

పైన్ నట్స్ ఇవి చాలా కాస్ట్..కాని ఇది అతి ఆకలిని బ్రహ్మండంగా తగ్గిస్తుంది.

ఇలాంటి లాభాలు ఈ డ్రైనట్స్, డ్రై ఫ్రూట్స్ లో ఉన్నాయి కాబట్టి.. గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ లాంటివి ఇవి తింటే వస్తాయనే అపోహను మానేసి..పైన చెప్పినట్లు తగిన మోతాదులో హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవి తింటూ..వీటినుంచి వచ్చే లాభాలు పొందాలంటే..ఇతర ఆహారాలను తగ్గించుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు.

గమనిక : ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.