రాత్రుళ్లు ఇవి తింటే.. త్వరగా బరువు పెరుగుతారు తెలుసా..?
మనం బరువు పెరగడానికి మనం చేసే తప్పులే కారణం.. తినే ఆహారం వల్లే మనం అడ్డదిడ్డంగా బరువుపెరిగిపోతుంటాం. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే శరీర బరువు తగ్గుతారు.

మనం బరువు పెరగడానికి మనం చేసే తప్పులే కారణం.. తినే ఆహారం వల్లేమనం Sudden weight gain అవుతుంటాం.ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే శరీర బరువు తగ్గుతారు. అదే అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే బరువు పెరుగుతారు. రోజూ తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. మీరు రోజు రాత్రుళ్లు ఇలాంటి ఆహారాలు తింటే.. కొన్నాళ్లకు కచ్చితంగా బరువుపెరుగుతారు.. మరి ఆ ఆహారాలు ఏంటంటే..
రాత్రి పూట క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోరాదు. వీటి వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాక కొవ్వుగా మారుతుంది. అధికంగా బరువు పెరుగుతారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవాలి. రాత్రి పూట మానేయాలి.
రాత్రి పూట మాంసాహారం తినడం కూడా మంచిది కాదు. అది కూడా త్వరగా జీర్ణం కాదు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. బరువు పెరుగుతారు. కాబట్టి నాన్‌వెజ్‌ను రాత్రి పూట తినరాదు.
రాత్రి పూట టీ, కాఫీ, గ్రీన్ టీ వంటి వాటిని తాగరాదు. వాటిల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. రాత్రి పూట నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. సరిగ్గా నిద్రించకపోతే బరువు పెరుగుతారు. కాబట్టి రాత్రి పూట టీ, కాఫీలను మానేయాలి.
రాత్రి సమయంలో చాలా మంది మద్యం సేవిస్తుంటారు. నిజానిటి నైట్‌లో సిట్టింగ్ వేస్తేనే మజా వస్తుంది. అయితే ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ.. మీరు అదేపనిగా రాత్రుళ్లు మద్యం తాగితే. శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరుతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. బరువు తగ్గుదామని ప్లాన్ వేసిన వారి ప్రయత్నాలు వృథా అవుతాయి. కాబట్టి రాత్రి పూట మద్యం సేవించరాదు.
ఈ విధమైన అలవాట్ల వల్ల బరువు పెరుగుతారు కాబట్టి.. వీటిని మానేయండి.. రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తింటే మంచిది. దీంతో తిన్న ఆహారాలు త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉంటుంది.