ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా.. వంకాయ అస్సలు తినొద్దు..

చాలా మంది ఇష్టంగా తినే వంటకాల్లో వంకాయ కూర ఒకటి.. తాజా కూరల్లో రాజా ఏదంటే వంకాయ అంటూ లొట్టలేసుకుంటూ మరి తింటారు అందులో గుత్తి వంకాయ అంటే కొందరికి పంచప్రాణాలు. అయితే ఎంత రుచిగా ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కచ్చితంగా వంకాయను దూరం పెట్టాల్సిందే లేదు అంటే ఈ సమస్యలను మరింత ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది..
వంకాయను ఏ రకంగా తీసుకున్న రుచిగానే ఉంటుంది.. వేపుడు కూర సాంబార్ దీంట్లో వేసినా చాలా ఇష్టంగా తింటారు.. అయితే అలర్జీ వంటి సమస్యలు ఉన్నవాళ్లు వంకాయను తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్లు వంకాయతో చేసిన కూరలు తీనకూడదు. ఇలా చేస్తే సంబంధిత సమస్యలు వేధిస్తాయి..
అయితే కళ్లకు సంబంధించిన ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కూడా వంకాయను తీసుకోకపోవడం మంచిది.. డిప్రెషన్ సంబంధిత సమస్యలతో తరచూ మందులు వాడుతున్న వాళ్ళు తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.. కిడ్నీ స్టోన్స్, ఫైల్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కూడా దీనికి దూరంగానే ఉండాలి.. ఇలాంటి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా వారైనా వంకాయను తీసుకుంటూ ఉంటే మరింతగా సమస్యలను పెంచుకున్నట్టే అవుతుంది..