వ్యాయామం మొదలు పెడుతున్నారా.. ఈ పొరపాట్లు చేయకండి...

మొదలు పెట్టేవారు చాలా విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.. లేదంటే సమస్యలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా కొత్తగా వ్యాయామాన్ని మొదలు పెట్టేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తోంది..

వ్యాయామం మొదలు పెడుతున్నారా.. ఈ పొరపాట్లు చేయకండి...


మొదలు పెట్టేవారు చాలా విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.. లేదంటే సమస్యలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా కొత్తగా వ్యాయామాన్ని మొదలు పెట్టేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తోంది..

ఏ రకమైన వ్యాయమాన్ని మొదలు పెట్టాలి అన్నా ముందుగా దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే వ్యాయామం వల్ల వచ్చే ఫలితాలు కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అసలు వ్యాయామం అలవాటు లేని వారు కొత్తగా ప్రయత్నించాలి అనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. 

వ్యాయామం చేయటానికి ఒక ప్రత్యేక సమయాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. అది ఉదయం అయినా సాయంత్రం అయినా కచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అలాగే మొదలుపెట్టిన రోజే కఠినమైన వ్యాయామాలు, అతి వ్యాయామాలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇంకా వీలైతే నిపుణుల సలహా తీసుకోవాలి..

ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటివరకు తీసుకున్న ఆహారం కంటే పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యాయామం చేసి వచ్చిన వెంటనే పాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాగే శరీరం నిరసించిపోకుండా పండ్లు, తాజా కాయగూరలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి..

అలాగే వ్యాయామం ప్రారంభించడానికి ముందు వార్మ్ అప్ చేయడం చాలా అవసరం.. దీని వలన పట్టేసిన కండరాలు వదులవుతాయి. పరిగెత్తడానికి సులువుగా ఉంటుంది.. కనీసం 10 నిమిషాల పాటు వార్మ్ అప్ చేయడం వల్ల వ్యాయామం కష్టంగా అనిపించదు.. 

పరిగెత్తే వాళ్ళు సరిపోయే షూస్ ఎంచుకోవడం ఎంతో అవసరం. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరిపడే షూస్ ఎంచుకోలేనప్పుడు విపరీతంగా కాళ్ల నొప్పులు వేధించే అవకాశం ఉంటుంది. దీని వలన కాన్ఫిడెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.. అలాగే తక్కువ సమయంలో నిర్దిష్ట సమయంలో పరిగెత్తాలనే నియమాలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు పాటించాలి.. పరిగెత్తి వచ్చిన వెంటనే కాళ్లకు ఆయిల్ మసాజ్ చేయడం, స్ట్రెచ్ ఎక్ససైజులు చేయటం, నొప్పి ఉన్న చోట ఐస్ పెట్టడం, వేడి నీటిలో పాదాలు ఉంచడం వంటివి చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది..  

అలాగే ముందే పెద్ద గమ్యాలను నిర్ణయించుకోకుండా చిన్న చిన్న గమ్యాలను చేరుకుంటూ పరుగును పూర్తి చేయాలి. అలాగే తగిన ఆహారం తీసుకుంటూ శరీరానికి కావాల్సిన విశ్రాంతి అందించాలి. వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.