పీరియడ్స్‌లో మెంతితో ఎంతో మేలు..!

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని సమృద్ధిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు

పీరియడ్స్‌లో మెంతితో ఎంతో మేలు..!


ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు నిండిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని సమృద్ధిగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలు దారి చేరవు. 

అయితే ఆకుకూరల్లో  మెంతి కూరది ప్రత్యేక స్థానం. చలువ చేసే ఈ కూరలో పోషకాలూ ఎక్కువే అంటుంటారు. వీటిని తరచు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మెంతికూరలో ఫోలిక్‌ యాసిడ్‌, థయామిన్‌, విటమిన్‌ ఎ, బీ6, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌ వంటి కీలక పోషకాలు, ఐరన్‌, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. 
కాళ్ల నొప్పులు వంటివీ తగ్గుతాయి.
మెంతికూరను రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత అదుపులో ఉంటుంది.
జుట్టు ఊడిపోయే సమస్య సైతం అదుపులో ఉంటుంది ఓడిపోయిన జుట్టు గ్రామంలో కొత్త జుట్టు వస్తుంది.
పీరియడ్స్‌ సమయంలో మహిళలు పొత్తికడుపు, నడుం నొప్పితో ఇబ్బందిపడతారు. ఇలాంటివారు  ఈ ఆకుకూరను తినడం వల్ల ఈ సమస్యని అధిగమించొచ్చు. అలానే బాలింతల్లో పాలూ సమృద్ధిగా పడతాయి.
ఇది అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. లావుగా ఉన్నామని బాధపడే వారు మెంతికూరను తరచూ తినడం వల్ల.. ఇందులో ఉండే ఫైబర్‌ మంచి కొలెస్ట్రాల్‌ పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా బాగుంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.