గర్భిణీలు పెయిన్ కిల్లర్స్ వాడితే పుట్టబోయే బిడ్డలో సంతానోత్పత్తి సమస్యలు..?

గర్భిణీలు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డల‌కు ఎన్నో రకాల సమస్యలు వస్తాయని తెలుస్తోంది. అంతేకాకుండా తల్లి ఈ మాత్రలు వాడటం వల్ల పిల్లల్లో సంతాన ఉత్పత్తి సమస్యలు సైతం తలెత్తుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది..

గర్భిణీలు పెయిన్ కిల్లర్స్ వాడితే పుట్టబోయే బిడ్డలో సంతానోత్పత్తి సమస్యలు..?
Fertility problems if pregnant women use pain killers


Pregnant ladies ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు వేసుకునే మందుల విషయంలో జాగ్రత్త ఎంతో అవసరం. కొందరు వైద్యుడు సలహా తీసుకోకుండానే ప్రతి చిన్న విషయానికి బయట దొరికే మందులు వాడుతూ ఉంటారు.. దీనివల్ల దీర్ఘకాలం వేధించే ఎన్నో సమస్యలు వస్తాయని తెలుస్తోంది.. 

ఈరోజుల్లో బయట చాలా రకాల pain killers దొరుకుతూ వస్తున్నాయి. విచ్చలవిడిగా వీటిని కొన్ని ఉపయోగించటం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డల‌కు ఎన్నో రకాల సమస్యలు వస్తాయని తెలుస్తోంది. అంతేకాకుండా తల్లి ఈ మాత్రలు వాడటం వల్ల పిల్లల్లో సంతాన ఉత్పత్తి సమస్యలు సైతం తలెత్తుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది..

గర్భిణీలు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డలో కచ్చితంగా డిఎన్ఏ పైన ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రభావం వారి భవిష్యత్తు తరాల పైన ఇబ్బందికర వాతావరణం ఏర్పాటుస్తుంది. పుట్టిన బిడ్డ మగ, ఆడ ఎవరైనా వారి సంతాన ఉత్పత్తి పై కచ్చితంగా ఈ మాత్రల ప్రభావం ఉంటుందని సమాచారం.

మరి అత్యవసరమైతే ఉపయోగించవచ్చు కానీ ప్రతిసారి మాత్రలు వాడకూడదని తెలుస్తోంది. అవసరమైతే కచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలని ఏ మాత్రం జాగ్రత్త వహించిన పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు తరాల పైన సైతం తల్లి కడుపులో ఉన్నప్పుడే వారి భవిష్యత్తు నిర్ణయించబడిపోతుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే గర్భధారణ సమయంలో డాక్టర్లు ఎన్నో రకాల మందులు సూచిస్తూ ఉంటారు. ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి మాత్రలు తరచు వేసుకున్న ఎలాంటి ప్రభావం ఉండదు కానీ ఈ సమయంలో సాధారణంగా వచ్చే నొప్పులకు భయపడి పెయిన్ కిల్లర్స్ వాడితే మాత్రం ప్రభావం తీవ్రంగానే ఉంటుందని తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.