Alcohol : మద్యం మానలేకపోతున్నారా..  సరే ఈ జాగ్రత్తలైనా పాటించండి.. 

Alcohol : కొందరు విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆల్కహాల్ లో మానిపించడం అంత తేలికైన పని కాదు అయితే క్రమక్రమంగా మాత్రం ఈ అలవాటును దూరం చేసుకోవచ్చని తెలుస్తోంది

Alcohol : మద్యం మానలేకపోతున్నారా..  సరే ఈ జాగ్రత్తలైనా పాటించండి.. 


Alcohol : కొందరు విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆల్కహాల్ లో మానిపించడం అంత తేలికైన పని కాదు అయితే క్రమక్రమంగా మాత్రం ఈ అలవాటును దూరం చేసుకోవచ్చని తెలుస్తోంది అంతేకాకుండా ఆల్కహాల్ తప్పనిసరి పరిస్థితుల్లో తాగే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే...

మద్యపానంలో స్మాల్ డ్రింక్ కొలమానం ఉంటుంది స్మాల్ డ్రింక్ అంటే ఒక హౌన్స్ కింద లెక్క కడతారు అంటే 30 ml అని అర్థం.. మగవారు రెండు స్మాల్ రింగ్స్ మహిళలు ఒక స్మాల్ రింగ్ తీసుకొని మద్యాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.. 

అలాగే కారణం ఏదైనా ఏ ఆహారం తీసుకోకుండా మద్యం తీసుకోవడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని తెలుస్తోంది దీనివల్ల రక్తంలో గ్లూకోస్ స్థాయిలో విపరీతంగా పడిపోతాయని తెలుస్తోంది.. ఇలా కొంతకాలం కొనసాగితే గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే ఆహారం తీసుకున్నక మధ్యాహ్నం తీసుకోవాలి.. 

అలాగే కొందరు పార్టీలో అతి చేస్తూ ఉంటారు ఒక్కసారిగా గడగడ తాగేస్తారు ఇది ఎంత మాత్రం మంచిది కాదని ముందుగా ఏవైనా స్నాక్స్ తీసుకొని తర్వాత డ్రింక్ చేయాలని చెబుతున్నారు అది కూడా చాలా నెమ్మదిగా తాగాలని తెలుస్తోంది.. 

అలాగే స్మోక్ చేస్తూ డ్రింక్ చేయడం వల్ల ఈ రెండిటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని తెలుస్తోంది.. అందుకే డ్రింక్ చేసే సమయంలో పక్కన పెట్టడం అవసరం..

అలాగే కొందరు భావోద్వేగాలని అదుపు చేసుకోలేక పోతారు దీనివలన సమస్యల నుంచి బయటపడటానికి ఆల్కహాల్ ఒక్కటే దారి అని అనుకుంటారు కానీ ఇది చాలా పొరపాటు సమస్యలు లేని వారు ఎవరు ఉన్నారు? అందుకే ఒత్తిడిలో ఉన్న సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాలను తీసుకోకూడదు..

అలాగే ఆల్కహాల్ను వివిధ రకాల డ్రింకులతో కలిపి తీసుకోకూడదని కూడా తెలుస్తోంది.. ఒడ్కా, బీర్ తీసుకోవడం వల్ల జీవ క్రియ దెబ్బతినే అవకాశం ఉంది.. అలాగే పీకలదాకా తాగిన తర్వాత డ్రైవింగ్ చేయకూడదు దీని వలన నేను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తాగిన తర్వాత ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.