sore throat : గొంతు నొప్పికి చిటికెలో తగ్గించే చిట్కాలు ఏంటంటే..
మారుతున్న వాతావరణంతో ఈరోజుల్లో ఎక్కడ చూసిన దగ్గు, జలుబు, గొంతు నొప్పి (Sore throat) వంటి సమస్యలు వేధిస్తూ వస్తున్నాయి. అయితే ఇలాంటివారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ సమస్యను తేలికగా దూరం చేసుకోవచ్చు..

మారుతున్న వాతావరణంతో ఈరోజుల్లో ఎక్కడ చూసిన దగ్గు, జలుబు, గొంతు నొప్పి ( sore throat ) వంటి సమస్యలు వేధిస్తూ వస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కొందరిలో ఈ సమస్య అంత తొందరగా తగ్గదు అంతేకాకుండా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రను సైతం ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా ఆహారం తినే సమయంలో కూడా ఎంతో ఇబ్బందిగా మారుతుంది అయితే ఇలాంటి అప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే తేలికగా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చని తెలుస్తోంది..
కాలం మారుతున్న ప్రతిసారి దగ్గు, జలుబు వంటి సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అయితే వీటికి ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్లి మందులు వాడటం కన్నా ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకొనే వస్తువులను ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. మన వంట గదిలో దొరికే చాలా వస్తువులతో తేలికగా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ప్రశాంతంగా ఏ వయసు వారైనా కొన్ని చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పి మటుమాయం అవుతుంది. అవి ఏంటంటే..
గొంతు నొప్పిని తగ్గించడంలో ముఖ్యంగా పసుపు పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.. వీటిని తీసుకోవడం వల్ల గొంతులో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తేలికగా దూరమవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు.. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుందని, ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి..
అలాగే ఈ సమయంలో అల్లం టీ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపశమనం దొరుకుతుంది.. అంతే కాకుండా గొంతుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా అల్లం.. శొంఠి.. కరక్కాయ వేసి మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల వెంటనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని తెలుస్తోంది.. అలాగే వేడి నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఆవిరి పీల్చడం వల్ల జలుబు వల్ల వచ్చే ఆటంకాలన్నీ తొలగి ఊపిరి పీల్చుకోవడం తేలికవుతుంది. అలాగే జలుబు చేసినప్పుడు తలంతా బరువుగా అనిపిస్తున్నప్పుడు ఇలా చేయడం వల్ల శరీరం తేలిక పడుతుంది.. అలాగే అల్లం రసంలో తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు..