Weight loss : ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఇవి పాటించాల్సిందే..

Weight gain కి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే జన్యువులు శరీర బరువుని పెంచేస్తాయి. వీటితోపాటు సరైన జీవనశైలి లేకపోవడం, షిఫ్ట్ లో పనిచేయటం, సమయానికి తినకపోవడం వంటి ఎన్నో కారణాలు weight gain కి కారణం అవుతున్నాయి.

Weight loss : ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఇవి పాటించాల్సిందే..
Tips for healthy weight loss


Obesity ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా తెలియకుండానే పెరిగిపోతున్న weight ని ఎలా అదుపు చేయాలో చాలామందికి అర్థం కాదు. over weight తో పలు అనారోగ్య సమస్యలు సైతం దాడి చేస్తూ ఉంటాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా పాటించాలి..

బరువు పెరగడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే జన్యువులు శరీర బరువుని పెంచేస్తాయి. వీటితోపాటు సరైన జీవనశైలి లేకపోవడం, షిఫ్ట్ లో పనిచేయటం, సమయానికి తినకపోవడం వంటి ఎన్నో కారణాలు బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే ఏది ఏమైనా బరువును అదుపులో ఉంచుకోవాలి లేకపోతే గుండెకు సంబంధించిన సమస్యలతో పాటు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు సైతం వేధిస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి సమస్యలు దరిచేరుతాయి. అందుకే కొన్ని విషయాలు పాటిస్తూ తేలికగా బరువు తగ్గటం ఎలాగో తెలుసుకుందాం..

 

పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి..

 దీని వలన తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే తిన్న ఆహారాన్ని పూర్తిస్థాయిలో అరిగించి మలబద్ధకం సమస్యలను సైతం దూరం చేస్తుంది..

 

చక్కెర పిండి పదార్థాలకు దూరం..

 పిండి పదార్థాలు చాలా వరకు మైదా వంటి అనవసరమైన పదార్థాలతో తయారుచేస్తారు. ఇవి శరీరాన్ని అధిక బరువుకు గురిచేస్తాయి. అలాగే చక్కెర సైతం శరీరానికి ఏ విధంగా ఉపయోగపడదు. వీటి నిల్వలు శరీరంలో పేరుకు పోతాయి. అందుకే ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉండాలి..

సరిపడా నీరు తాగటం..

 రోజు కచ్చితంగా తగినంత నీరు తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు అన్ని తేలికగా బయటకు పోవాలి అంటే నీరు అత్యవసరం. ఇంకా తిన్న సమయంలో కచ్చితంగా నీటిని తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీవ క్రియ మందగిస్తుంది.

గ్రీన్ టీ తాగాలి..

 గ్రీన్ టీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే రోజంతా చురుకుగా ఉండటానికి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండటానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.