Post-Workout Nutrition : వ్యాయామం పూర్తయ్యాక ఏ ఆహారం తీసుకోవాలంటే.. !

కొత్తగా వ్యాయామాన్ని మొదలుపెట్టిన వారు ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. .అందుకే వ్యాయామంతో పూర్తిగా నిరసించి పోయిన శరీరాన్ని మళ్లీ మునుపటి స్థాయికి తీసుకువచ్చి ఉత్సాహంతో ఉరకలు వేయాలి అంటే Post-Workout Nutrition విషయంలో మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే..

Post-Workout Nutrition  :  వ్యాయామం పూర్తయ్యాక ఏ ఆహారం తీసుకోవాలంటే.. !


కొత్తగా వ్యాయామాన్ని మొదలుపెట్టిన వారు ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఏదైనా మంచి పని మొదట్లో ఇబ్బంది కలిగిస్తుంది కానీ తర్వాత ఎన్నో ప్రయత్నాలు ఇస్తుంది.. ఇలాంటి వాటిలో వ్యాయామం కూడా ఒకటి. పరుగు, నడక ఇలాంటి ఏ వ్యాయామైనా మొదటిలో శరీరాన్ని కొంత ఇబ్బంది పెట్టే మాట నిజమే. ముఖ్యంగా విపరీతంగా కాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరం నీరసంగా మారుతుంది. దీనిని మళ్లీ పునరుత్తేజం తెప్పించాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. 

వ్యాయామం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ పలు కారణాలతో వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఎలాగో మొదలుపెట్టి కొన్ని రోజులు వ్యాయామాన్ని చేస్తారు. అయితే మొదట్లో దీని గురించి పూర్తిగా తెలియక కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆహారాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల శరీరం మొత్తం నీరసం అయిపోయాయి అవకాశం ఉంది. అందుకే వ్యాయామంతో పూర్తిగా నిరసించి పోయిన శరీరాన్ని మళ్లీ మునుపటి స్థాయికి తీసుకువచ్చి ఉత్సాహంతో ఉరకలు వేయాలి అంటే  విషయంPost-Workout Nutrition  లో మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే.. అవి ఏంటంటే.. 

Best exercise tips, avoid these 7 foods before your workout to get ...

డ్రై ఫ్రూట్స్.. 

వ్యాయామం చేసి వచ్చాక అలసిపోయిన శరీరాన్ని అలసట నుంచి బయటపడేసే అద్భుత ఔషధం డ్రై ఫ్రూట్స్. రాత్రి బాదం, పల్లీలు, కొమ్ము శ, ఎండు ఖర్జూరం వంటి వాటిని నీటిలో నానబెట్టి ఉదయం వ్యాయామం చేసి రాగానే తీసుకోవాలి. దీనివలన శరీరం శక్తిని పుంజుకుంటుంది.. 

రాగి జావ.. 

రాగులతో చేసిన ఆహారం శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే వ్యాయామం చేసి రాగానే రాగిజావను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. అంతేకాకుండా పరిగెత్తే సమయంలో ఆవేశాన్ని తగ్గించడంలో రాగిజావ సహాయపడుతుంది. అందుకే రోజు రాగి జావను తీసుకోవడం వల్ల శరీరం చాలా చురుకుగా పనిచేస్తుంది.. 

పాలు.. 

వ్యాయామం చేసే ప్రతి ఒక్కరూ రెండు పూటలా తీసుకోవలసిన ఆహారం పాలు. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి.. 

గుడ్లు.. 

రోజు రెండు గుడ్లను తీసుకోవడం వల్ల శరీరానికి నీరసం దరిచేరదు. దీనిని ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. అలాగే వ్యాయామం చేసే సమయంలో ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది..

నల్ల బెల్లం, వాల్ నట్స్..

వ్యాయామం చేసే వారికి మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో నల్ల బెల్లం, వాల్నట్ మంచిగా పని చేస్తాయి. రోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీరసం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ముఖ్యంగా వ్యాయామం సమయంలో కాళ్లు వణికే వాళ్లు వీటిని తీసుకోవాలి. కేవలం నీరసం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. కొన్ని రోజులపాటు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది.. 

మాంసాహార పదార్థాలు.. 

చికెన్, మటన్, చేపలు వంటి వాటిని వ్యాయామం చేసే వాళ్ళు ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. అయితే మసాలాలకు, వేపుళ్లకు దూరంగా ఉండాలి. ఉడికించిన మాంసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.. 

సూప్స్...

కాయగూరలతో చేసినా.. మాంసాహారంతో చేసిన ఎలాంటి సూప్స్ ను తీసుకున్న మెరుగైన ఫలితాలు ఉంటాయి  ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి మెరుగైన ఫలితాలను ఇస్తాయి.. అలాగే అలసటను తగ్గిస్తాయి..

గ్లూకోజ్ వాటర్.. 

వ్యాయామం సమయంలో ఎప్పుడు వెంట ఉంచుకోవలసిన వస్తువు గ్లూకోజ్ వాటర్. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో తోడ్పడుతుంది..

అరటి పండ్లు..

వ్యాయామానికి ముందు ఒక అరటిపండు తిని వెళ్లడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వ్యాయామం చేసే సమయంలో బరువును కోల్పోకుండా ఉండటానికి అరటి పండ్లను తీసుకుంటూ ఉండాలి. ఏ సమయంలో తీసుకున్న వీటివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.. అన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.