బ్రెయిన్ హెల్త్ బావుండాలనుకుంటున్నారా.. కచ్చితంగా ఇవి తినాల్సిందే..

బ్రెయిన్ కూడా ఫుడ్ ఉందని తెలుసా..  కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుంది. అవి ఏంటంటే.. బ్రెయిన్ షార్ప్ గా పని చేయడంలో ఎప్పుడూ

బ్రెయిన్ హెల్త్ బావుండాలనుకుంటున్నారా.. కచ్చితంగా ఇవి తినాల్సిందే..


బ్రెయిన్కూడా ఫుడ్ ఉందని తెలుసా..  కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుంది. అవి ఏంటంటే.. బ్రెయిన్ షార్ప్ గా పని చేయడంలో ఎప్పుడూ ముందుండేవి చేపలు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే బ్రెయిన్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి..

అలాగే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.. వీటిలో వుండే విటమిన్స్, బి కాంప్లెక్స్ బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా సహకరిస్తాయి. అంతేకాకుండా ఎదుగుతున్న పిల్లలకు తప్పకుండా ఆకుకూరలని తినిపించాలి.. బ్రకోలి, బ్లూబెర్రీ, గుడ్లు వంటివన్నీ కూడా తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల బ్రెయిన్ సక్రమంగా పనిచేస్తుంది..

అంతేకాకుండా బ్రెయిన్ ఆరోగ్యానికి నట్స్ ఎంతో ఉపయోగపడతాయి..   ఇందులోని పోషకాల కారణంగా బ్రెయిన్ బాగా పనిచేయడమే కాదు, గుండెకి కూడా చాలా మంచిది. బాదం, పిస్తా పప్పు, వాల్‌నట్స్ వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాదు..  బ్రెయిన్ బాగా పనిచేస్తుందట.. వీటితోపాటు గుమ్మడి గింజలను కూడా తరచూ తీసుకోవటం మరింత ప్రయోజనం ఉంటుంది.

తరచుగా డార్క్ చాక్లెట్ ని తీసుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా పని చేస్తుందని అంటారు.. అలాగే చిరాకు, కోపంగా ఉన్నపుడు మానసిక ఉల్లాసం కోసం డార్క్ చాక్లెట్ బాగా పని చేస్తుందని తెలుస్తుంది.. ఇదే కాకుండా రోజు తప్పకుండా ఆరు నుంచి పది గ్లాసులు నీరు తీసుకోవడం వల్ల ఏ రకమైన తలనొప్పి అయినా తగ్గుతుందని డాక్టర్లు అంటున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.