Liver : లివర్ పనితీరు మెరుగుపడాలా.. ఇవి తినండి..
మనిషి శరీరంలోనే అత్యంత ముఖ్యమైన అవయవం Liver .. ప్రతిరోజు జరిగే జీర్ణక్రియలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.. శరీరంలో ఉండే విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడమే

మనిషి శరీరంలోనే అత్యంత ముఖ్యమైన అవయవం Liver .. ప్రతిరోజు జరిగే జీర్ణక్రియలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.. శరీరంలో ఉండే విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఎన్నో ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తుంది. అయితే ఇలాంటి లివర్ను క్లీన్ గా ఉంచుకోవటానికి నిపుణులు ఏమంటున్నారంటే..
రోజు శరీరంలో జరిగే ఎన్నో పనుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది లివర్.. ముఖ్యంగా ఆహారం జీర్ణం కావడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.. రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం పాత్ర ప్రధానమైనది.. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను తయారు చేయటానికి లివర్ ఎంతో అవసరం... అలాగే లివర్ మన శరీరంలో దాదాపు 500 రకాల పనులను చేస్తుంది. ఇంతటి ముఖ్యమైన భాగాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.. అలా కాకుండా లివర్లో ఉండే విష పదార్థాలను బయటకు పంపించడం ఎంతైనా అవసరం.. ఇందుకు గాని ఏం చేయాలి అంటే..
గోధుమ గడ్డి ఎన్నో పోషకాలకు నిలయం.. ఇందులో క్లోరోఫిల్ మెండుగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాకటాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.. తరచుగా గోధుమ గడ్డి జ్యూస్ తీసుకుంటే.. లివర్ పనితీరు మెరుగుపడుతుంది..
అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో తీసుకోవటం వలన కాలేయంపై ఉండే కొవ్వు నిల్వలు తగ్గుతాయి అంతేకాకుండా లివర్ లో చెడిపోయే స్థితిలో ఉన్న కణాలను రేపటి స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయి.. అలాగే హెర్బల్ టీలు కూడా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని తెలుస్తోంది రోజు గ్రీన్ టీ బ్లాక్ టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల లివర్ లో ఉండే కొవ్వు నిల్వలు తగ్గుతాయి అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని సైతం దూరం చేయటానికి సహాయపడతాయి.. అలాగే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి..

అలాగే బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో బీటాలైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకే ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ ని తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుందని తెలుస్తోంది.. అలాగే ద్రాక్ష జ్యూస్ ను కూడా రోజు తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది.. మాంసాహార పదార్థాలకు.. మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి.. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో లివర్ చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం..