శరీరంలో అన్ని రోగాలని నివారించే ఔషధం శొంఠి.. దీనిని ఏ రూపంలో తీసుకుంటే ఏ ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!

ఇప్పుడంటే ఏ చిన్న సమస్యకైనా ఆధునిక ఔషధాలు వినియోగిస్తున్నారు. కానీ పాత రోజుల్లో అయితే ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలుతుందంటే దానికి వంటింట్లోనే చక్కటి పరిష్కారం దొరికిపోతుంది. అలా అనేక రకాల సమస్యలకు వినియోగించే ఆయుర్వేద ఆయుధమే శొంఠి. అవును మన వంటింట్లో బామ్మలు వినియోగించే శొంఠి..

శరీరంలో అన్ని రోగాలని నివారించే ఔషధం శొంఠి.. దీనిని ఏ రూపంలో తీసుకుంటే ఏ ప్రయోజనాలు ఉంటాయో తెలుసా!


ఇప్పుడంటే ఏ చిన్న సమస్యకైనా ఆధునిక ఔషధాలు వినియోగిస్తున్నారు. కానీ పాత రోజుల్లో అయితే ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలుతుందంటే దానికి వంటింట్లోనే చక్కటి పరిష్కారం దొరికిపోతుంది. అలా అనేక రకాల సమస్యలకు వినియోగించే ఆయుర్వేద ఆయుధమే శొంఠి. అవును మన వంటింట్లో బామ్మలు వినియోగించే శొంఠి..
Dry Ginger Benefits: సర్వరోగ నివారిణి.. మహా ఓషది శొంఠి... వర్షాకాలంలో వచ్చే  వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందో తెలుసా | Amazing health benefits of the  miracle dry ginger | TV9 Telugu
అల్లం పై పొట్టుని తీసేసి సున్నపు తేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది. శొంఠిని సంస్కృతంలో మహా ఓషది, విశ్వభేషజాం అని కూడా అంటుoటారు. మరి ఇది చేసే మంచి ఎంతో తెలుసా...?
శొంఠి వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గించడంలో...మూత్రపిండ రోగాలను అరికట్టడంలో వుత్తమంగా పనిచేస్తుంది.
పురుషులలో శొంఠి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. శ్వాశ రోగాలను, దగ్గు, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగాలను తగ్గిస్తుంది.
కడుపులో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి బైట పడేందుకు పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది.
దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి తీసుకుంటే విష జ్వరాలు తగ్గిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది.
కీళ్ల జాయింట్లలో వాపు వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు.... దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదుగా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది.
చాలా మందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని  రోజూ రెండు పూటలా 5గ్రా మోతాదులో సేవిస్తూ ఉంటే మంచి ఆకలి అవుతుంది.
ఏక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి.
అలాగే రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంథము 10గ్రా  తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి... నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండు రోగము తగ్గి... రక్తము వృద్ధి చెందును.
ఇంకా పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది.
అలాగే నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.