చూడగానే తినేయాలనిపించే అల్ల నేరేడు పండు.. ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే తెచ్చుకొని తింటారు..!

సాధారణంగా సీజనల్ ఫండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట నిజమే ఈ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినేయాలని చెబుతూ ఉంటారు మన ఆరోగ్యాన్ని పనులు అందులో ముఖ్యంగా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందించడమే కాకుండా

చూడగానే తినేయాలనిపించే అల్ల నేరేడు పండు.. ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే తెచ్చుకొని తింటారు..!


సాధారణంగా సీజనల్ ఫండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట నిజమే ఈ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినేయాలని చెబుతూ ఉంటారు మన ఆరోగ్యాన్ని పనులు అందులో ముఖ్యంగా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందించడమే కాకుండా పలు రకాల వ్యాధుల్లో ఉండి దూరం చేసే పండ్లను అసలు వదలకూడదు దొరికిన వెంటనే తినేయాలి. అలాంటి ఖాతాలోకి చేరేదే అల్లనేరేడు పండు .

100 g Jamun / Naval Vithai Powder Online - hbkonline.in

ఎండాకాలంలో ఎక్కువగా దొరికే కర్పూజ పుచ్చకాయ బొప్పాయి పండ్లతో పాటు అల్లం నేరేడు పండు సైతం ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ పండులో పోషకాలు అత్యధికంగా ఉంటాయి మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్‌. ప్రతి చోటా ఈ పండ్లు ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఈ పండ్లను తెచ్చుకొని తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

మధుమేహం అదుపులో.. 

ఈ పండు శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మధుమేహ బాధితుల సంఖ్య అత్యధికంగా ఉండడంతో ఈ పండ్లకు గిరాకీ రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ పండ్లకు నగరంలో ఆదరణ పెరుగుతుండడంతో చాలా మంది రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు.

పోషకాల గని...

అన్ని పండ్లలాగానే అల్లనేరేడులో కూడా పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైములు మెండుగా ఉంటాయి.

ఉబకాయం తగ్గిస్తుంది..

ఊబకాయంతో బాధపడేవారు ఈ పండ్లను తరచు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. వీటిని కొంచెం తినగానే కడుపు నిండిన భావం కలుగుతుంది దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందటమే కాకుండా వేరే ఆహార పదార్థాలు తినాలని ఆలోచన తగ్గుతుంది.

స్త్రీ సమస్యలు దూరం..

అతిసార, స్ర్తీలలో నెలసరి సమస్యలు, జననేంద్రియ సమస్యలు తొలగుతాయి. నెలసరి సమయంలో వచ్చే అధిక నొప్పిన తగ్గించడంలో ఈ ముందుంటాయి..

రక్తపోటు అదుపులో ఉంటుంది..

ఈ పండ్లను తరచు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది దీంతో హై బీపీ సమస్య ఉన్నవారు ఈ పండ్లను అభ్యంతరం లేకుండా తినొచ్చు అలాగే గుండెపోటు సమస్యలు సైతం దరిచారని తెలుస్తోంది ఇన్ అద్భుత పోషకాలు ఉన్న ఈ పండ్లను వెంటనే తెచ్చుకొని తినేయటం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.