చెవుల్లో వెంట్రుకలు పెరుగుతున్నాయి.. గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ ఎక్కువే

పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి Ears పై వెంట్రుక‌లు పెరుగుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఇలాంటి వారికి Heart problems వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువట..

చెవుల్లో వెంట్రుకలు పెరుగుతున్నాయి.. గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ ఎక్కువే
Hair growth in ears is a sign for heart disease


నేడు మనుషుల ప్రాణాలను తీసే జబ్బుల్లో వింత వైరస్‌ల తర్వాత heart disease లే ఎక్కువగా ఉన్నాయి.. నిన్నటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవాళ్లే ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. సీన్‌ కట్‌ చేస్తే ఆసుపత్రిల్లో ప్రాణాలతో పోరాటం.. heart problems  ప్రాణాంతకం.. ఎప్పుడు వస్తాయో తెలియదు అని అందరూ అనుకుంటారు.. Heart attack క్షణాల వ్యవధిలో వస్తుంది కానీ.. ఇది రావడానికి ముందే ఎన్నో సంకేతాలను బాడీ తెలియజేస్తుంది. మీరు పెద్దోళ్లలో చెవిలో వెంట్రుకలను చూసే ఉంటారు. మన తాతయ్యకు ఎక్కువగా ఉంటుంది. ఇలా చెవిలో వెంట్రుకలకు గుండె ఆరోగ్యానికి సంబంధం ఉంది తెలుసా..? ఈ విషయాన్ని సాక్షాత్తూ సైంటిస్టులే తేల్చారు.

పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి చెవుల‌పై వెంట్రుక‌లు పెరుగుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఇలాంటి వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువట.. ఈ క్ర‌మంలో అలాంటి వారిని రెండు వ‌ర్గాలుగా విభ‌జించి పరిశోధకులు అధ్య‌య‌నం చేప‌ట్టారు. యుక్త వ‌య‌స్సులో చెవుల‌పై వెంట్రుక‌లు రాక‌పోయినా కొంద‌రికి వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ వెంట్రుక‌లు వ‌స్తాయి. ఇక కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే చెవుల‌పై వెంట్రుక‌లు వ‌స్తుంటాయి.

అయితే దీనికి, గుండె జ‌బ్బుల‌కు ఉన్న సంబంధం తెలియ‌దు కానీ.. ఈ విధంగా ఉండ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయ‌ని మాత్రం సైంటిస్టులు చెబుతున్నారు. ఎవరికైతే చెవులపై వెంట్రుకలు వస్తాయో.. అలాంటి వారు ముంద‌స్తుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది. గుండె జ‌బ్బులు అనేవి సైలెంట్ కిల్ల‌ర్ లాంటివి. అవి వ‌చ్చే వ‌ర‌కు మ‌న‌కు వాటి గురించి తెలియ‌దు. వ‌స్తే మాత్రం ప్రాణాంత‌కంగా మారుతాయి. ఇలా వెంట్రుకలు రావడం కూడా ఒకందుకు మంచి విషయమే.. మన గుండె ఆరోగ్యం బాలేదు.. ప్రమాదం ఉందని ముందే తెలుసుకునే వీలు ఉంటుంది దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.. వేళకు తినాలి. ఆకలిగా లేదని ఆహారాన్ని వాయిదా వేయకూడదు. మద్యపానం, ధూమపానం తగ్గిస్తే చాలు.. మానేయక్కర్లేదు. కొందరు అదేదో ఉద్యమం లెక్క తాగుతుంటారు. అప్పుడప్పుడు చేస్తే..ఏ అలవాటు ప్రమాదం కాదు. ఇక బయటిఫుడ్స్‌ కూడా.. పిజ్జాలు, బర్గర్లు, ఛీస్‌లు అంటూ ఏదిపడితే అది తింటే.. బాడీలో ఫ్రీ రాడికల్స్‌ ఎక్కువైపోయి..గుండెజబ్బులతో పాటు క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.