ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా? మీ చావును మీరే కోరి తెచ్చుకున్నట్లే..

Effects of eating on empty stomach: డబ్బులు సంపాదించాలనే కోరికతో చాలా మంది బిజీ లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తింటున్నారా? మీ చావును మీరే కోరి తెచ్చుకున్నట్లే..
Harmful effects of eating on empty stomach


డబ్బులు సంపాదించాలనే కోరికతో చాలా మంది బిజీ లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు..మనకు నచ్చిందని, అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. వాటిపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వాటిని తినేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన అనారోగ్య సమ్యలతో బాధపడుతున్నారు. అసలు మనం ఉదయం పూట ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోకూడని వాటిల్లో కాఫీ, టీ లు కూడా ఒకటి. చాలా మంది బెడ్ కాఫీ, టీ లను తాగేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎసిడిటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ, కాఫీ లు తాగే అలవాటు ఉన్న వారు ఆ అలవాటును సాధ్యమైనంత త్వరగా మానుకోవాలి. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్, సోడా వంటి చల్లటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో అల్సర్స్, వాంతులు అవ్వడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక కూల్ డ్రింక్స్ ను ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. వీటిని బదులుగా తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది...

ఖాళీకడుపుతో టమాటాలను తీసుకోకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో టమాటాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే యాసిడ్ల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో కారంగా ఉండే పదార్థాలను, మసాలా దట్టించి వండిన పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే పరగడుపున పెరుగును తీసుకోకూడదు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి దీనిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ఇకపోతే ఆల్కాహాల్ ను కూడా తీసుకోకూడదు, పుల్లగా ఉండే వాటిని అస్సలు తీసుకోకండి..ఉదయం ఎట్టి పరిస్థితిలో కూడా వీటి జోలికి అస్సలు వెళ్ళకండి.. డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.