Dates with milk : పాలు, ఖర్జూరాలు కలిపి తాగితే అన్నీ లాభాలే.. అస్సలు మిస్‌ కావొద్దు..!!

Dates with milk : చిన్నప్పటి నుంచి పాలను, ఖర్జూరాలను తినే ఉంటారు..కానీ వీటిని కలిపి  (Dates with milk) ఎప్పుడైనా తిన్నారా.. పాలల్లో ఖర్జూరాలు నానపెట్టుకోని తినాలనే ఐడియా మీకు వచ్చిందా..? ఇవి రెండు ఆరోగ్యానికి మంచివే..!

Dates with milk :  పాలు, ఖర్జూరాలు కలిపి తాగితే అన్నీ లాభాలే.. అస్సలు మిస్‌ కావొద్దు..!!
Dates with milk


చిన్నప్పటి నుంచి పాలను, ఖర్జూరాలను తినే ఉంటారు..కానీ వీటిని కలిపి  (Dates with milk) ఎప్పుడైనా తిన్నారా.. పాలల్లో ఖర్జూరాలు నానపెట్టుకోని తినాలనే ఐడియా మీకు వచ్చిందా..? ఇవి రెండు ఆరోగ్యానికి మంచివే..! ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఈ రెండింటిలో ఉండే పోష‌కాలు మ‌న‌కు ఒకేసారి ల‌భిస్తాయి. దీని వల్ల పోష‌కాహార లోపం రాకుండా ఉంటుంది. ఒక గ్లాస్‌ పాల‌లో 4 ఖ‌ర్జూరాలను వేసి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఆ పాల‌ను మ‌రిగించాలి. ఈ పాల‌ను ఉద‌యం ఒక క‌ప్పు, సాయంత్రం ఒక క‌ప్పు తాగాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

పాలు, ఖ‌ర్జూరాలు క‌లిపిన మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌క్తి బాగా ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. జిమ్ చేసేవారికి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారికి ఈ మిశ్ర‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అమిత‌మైన బ‌లాన్ని అందిస్తుంది.

పాలు, ఖ‌ర్జూరం మిశ్ర‌మం తాగ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. దీని వ‌ల్ల సంతాన లోపం స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మ‌చ్చ‌లు పోతాయి. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు.

పాలు, ఖ‌ర్జూరాల మిశ్ర‌మాన్ని తాగితే అధికంగా బ‌రువు పెరుగుతారు. క‌నుక అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగ‌రాదు

పాలు, ఖ‌ర్జూరాల మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణం, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతుంది.

ఈ మిశ్ర‌మాన్ని తాగితే మెద‌డు పనితీరు మెరుగు ప‌డుతుంది. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. చిన్నారులు చ‌దువుల్లో రాణిస్తారు. తెలివితేట‌లు పెరుగుతాయి.

కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తాగుతుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

అలర్జీల స‌మ‌స్య ఉన్న‌వారు ఈ మిశ్ర‌మాన్ని తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.