ఆరోగ్యం కోసం గోబి ఉప్మా.. భలే టేస్టీ టేస్టీగా...
ఉప్మా ఆరోగ్యకరమైన అల్పాహారం. త్వరగా జీర్ణం అవుతుంది. కానీ చాలా మంది దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఉప్మాను అనేక రకాలుగా రుచికరంగా వండచ్చు. ముఖ్యంగా క్యాబేజీ ఉప్మా తిన్నారా? ఇది రెగ్యులర్ ఉప్మా

ఉప్మా ఆరోగ్యకరమైన అల్పాహారం. త్వరగా జీర్ణం అవుతుంది. కానీ చాలా మంది దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఉప్మాను అనేక రకాలుగా రుచికరంగా వండచ్చు. ముఖ్యంగా క్యాబేజీ ఉప్మా తిన్నారా? ఇది రెగ్యులర్ ఉప్మా కన్నా టేస్టీ, పోషకభరితమైన రెసిపీ.
అసలే క్యాబేజ్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి, థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఫుల్ గా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. ఇది పిత్త ఆమ్లాలను బంధించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మరి ఇటువంటి పోషకాలు నిండిన క్యాబేజీ ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం...
కావలసినవి....
1 కప్పు రవ్వ
1/2 కప్పు క్యాబేజీ తురుము
1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
2 టేబుల్ స్పూన్లు టమోటా ముక్కలు
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ మినపపప్పు
1/2 స్పూన్ శనగపప్పు
5 జీడిపప్పు
5 పచ్చి మిరపకాయలు
2 కప్పుల నీరు
2 tsp వంట నూనె
2 స్పూన్ నెయ్యి
కరివేపాకు ఒక రెమ్మ
రుచికి తగినంత ఉప్పు