రోజ్‌ యాపిల్స్‌ను ఎప్పుడైనా చూశారా.. తింటే ఎన్ని లాభాలో..!

ఫ్రూట్స్‌ అంటే మనకు ఆ ఆపిల్‌, ఆరెంజ్‌, బత్తాయ, పుచ్చకాయ మహా అయితే మామిడి ఇవే గుర్తుకువస్తాయి.. మార్కెట్‌లో మనకు తెలియని పండ్లు చాలా ఉంటాయి.మీరు చూసి వదిలేసిన వాటిలో ఈ పండు కూడా ఒకటి. దీనిపేరే Rose apples. వీటినే వాట‌ర్ యాపిల్స్ అని కూడా అంటారు.

రోజ్‌ యాపిల్స్‌ను ఎప్పుడైనా చూశారా.. తింటే ఎన్ని లాభాలో..!
Benefits of Rose apple


ఫ్రూట్స్‌ అంటే మనకు ఆ ఆపిల్‌, ఆరెంజ్‌, బత్తాయ, పుచ్చకాయ మహా అయితే మామిడి ఇవే గుర్తుకువస్తాయి.. మార్కెట్‌లో మనకు తెలియని పండ్లు చాలా ఉంటాయి.. వాటిని మనం చూస్తూనే ఉంటాం కానీ ఇప్పడు ఇవి ఎందుకులే..కేజీ ద్రాక్ష తీసుకోని పోదాం అన్నట్లు మనం అనుకుంటాం.. అలా మీరు చూసి వదిలేసిన వాటిలో ఈ పండు కూడా ఒకటి. దీనిపేరే Rose apples. వీటినే వాట‌ర్ యాపిల్స్ అని కూడా అంటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటాయి. వీటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

వాట‌ర్ యాపిల్స్ బాగా పండితే తియ్యగా ఉంటాయి. కానీ అక్క‌డ‌క్క‌డా చేదులా అనిపిస్తుంది. ఇక ఈ పండ్లు మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. బాక్టీరియా, వైర‌స్ సంబంధ వ్యాధులు త‌గ్గుతాయి. 

ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటివి ఉండ‌వు. అలాగే శ‌రీరంలోని కొవ్వు కూడా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. 

ఈ పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. 

అలాగే ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. చ‌ర్మం మృదువుగా, తేమ‌గా మారుతుంది. పొడిబార‌కుండా ఉంటుంది.

ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సీ దంతాలు, చిగుళ్ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. 

చిగుళ్ల నుంచి ర‌క్తం కారే స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్‌ రాని వాళ్లు ఈ పండ్లు తింటే.. అసలు భవిష్యత్తులో షుగర్‌ వచ్చే అవకాశమే ఉండదు.

ఇక ఈ పండ్ల‌ను తినడం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఈ పండ్లు డైలీ తింటే నిత్యం యవ్వనంగా ఉండొచ్చు.

ఈసారి మార్కెట్‌లో ఈ పండ్లు కనిపిస్తే.. విడిచిపెట్ట‌కండి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.