కిడ్నీలో రాళ్లను సహజంగా కరిగించాలా.. ఇంట్లోనే తేలికగా పాటించే ఈ ఏడు నియమాలు తెలుసుకోకపోతే ఎలా మరి!

మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే కిడ్నీల పనితీరు సరిగా ఉండాలి. అయితే చాలా మందిలో వివిధ కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఎర్పడుతుంటాయి. వీటిని ప్రస్తుతం అందివచ్చిన ఆధునిక సాంకేతికతో సర్జరీల ద్వారా తొలగిస్తున్నారు. కానీ.. కొన్ని సహజమైన పద్ధతుల్లో కూడా కిడ్నీల్లోని రాళ్లను తొలగించుకోవచ్చు. అదెలాగో... మీరూ తెలుసుకోండి..

కిడ్నీలో రాళ్లను సహజంగా కరిగించాలా.. ఇంట్లోనే తేలికగా పాటించే ఈ ఏడు నియమాలు తెలుసుకోకపోతే ఎలా మరి!


మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే కిడ్నీల పనితీరు సరిగా ఉండాలి. అయితే చాలా మందిలో వివిధ కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఎర్పడుతుంటాయి. వీటిని ప్రస్తుతం అందివచ్చిన ఆధునిక సాంకేతికతో సర్జరీల ద్వారా తొలగిస్తున్నారు. కానీ.. కొన్ని సహజమైన పద్ధతుల్లో కూడా కిడ్నీల్లోని రాళ్లను తొలగించుకోవచ్చు. అదెలాగో... మీరూ తెలుసుకోండి..

నీరు ఎక్కువ తీసుకోవడం :

సహాజంగానే రోజులో కనీసం 5 లీటర్ల మంచి నీరు తీసుకుంటుండడం మంచిది. వేసవి కాలంలో ఈ పరిమాణం కాస్త ఎక్కువైనా ఫర్వాలేదు. ఇలా రోజులో ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని ఖనిజాలు, ఇతర మలినాలు సులువుగా బయటకు వెళ్తాయి. నీటతో పాటు వ్యర్థాలు సులువుగా శరీరాన్ని వదలడంతో చాలా రకాల సమస్యల నుంచి తప్పించుకున్నట్లే.. అలాగే... కిడ్నీలోని రాళ్లు కొంచెం కొంచెం కరిగి మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.

కిడ్నీ బీన్స్ :

మూత్ర పిండాల్లోని రాళ్లను బయటకు పంపడంలో కిడ్నీ బీన్స్ మంచిగా పనిచేస్తాయి. వీటిని రోజూ 8 నుంచి 12 గంటల మేర నీటిలో నానబెట్టాలి. వాటిని ఉడకబెట్టి తీసుకోవాలి.. కిడ్నీ బీన్స్‌లో ఉండే ఫైబర్ మూత్ర పిండాల్లోని రాళ్లను బయటకు నెట్టివేస్తాయి. కిడ్నీలో రాళ్లతో బాధపడే వాళ్లు రోజులో ఒక్కసారైనా వీటిని తీసుకోవాలి. 

ఎండబెట్టిన తులసి ఆకులు :

ఎండబెడ్టిన తులసి ఆకులను పొడిగా నలపాలి... ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ మేర తీసుకోని... నీటిలో కలిపాలి. దానితో తేనీరులా చేసుకోవాలి. ఈ టీని రోజులో మూడు సార్లు తాగాలని సూచిస్తున్నారు వైద్యుల. ఇది కడుపులోని ఎసిటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలోని రాళ్లు సైతం విచ్ఛిన్నమై సులభంగా బయటకు పోతాయి.

 మొక్కజొన్న పీచు :

చాలా మందికి మొక్కజొన్న తింటూనే ఉంటారు. అయితే... కంకి గింజల్ని మాత్రమే తినేంసి... కంకిపై వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో మొక్కజొన్న పీచు చాలా బాగా0 ఉపయోగపడుతుంది

నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ :

కిడ్నీలోని రాళ్లను బయటకు పంపడంలో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం కిడ్నీ రాళ్లను ముక్కలుగా చేస్తే.. వాటిని సులభంగా బయటకు పంపేందుకు ఆలివ్ ఆయిల్ లూబ్రికెంట్‌లా ఉపయోగపడుతుంది.

దానిమ్మ :

దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కిడ్నీ రాళ్లను సహజంగా తొలగించడానికి దానిమ్మ రసం పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.

ఆపిల్ సీడర్ వెనిగర్ :

దీనిని తీసుకోవడం వల్ల ఇందులోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్లను చిన్నచిన్న ముక్కలుగా విడగొడుతుంది. దాంతో అవి... మూత్రాశయం ద్వారా సులువుగా బయటకు వెళ్లేందుకు వీలవుతుంది. ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల నుంచి అనేక ఇతర వ్యర్థ పదార్థాలు సైతం బయటకు వెళ్లడంతో... కిడ్నీలు శుద్ధమవుతాయి. రాళ్లు తొలగిపోయే వరకు రోజూ రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ను వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.