కిడ్నీ సమస్యలు ఉన్నాయా.. వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువ అవుతుంది సుమా.!

మూత్రసానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న అవి ఎండాకాలంలో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మధ్య అవసరం లేదంటే సమస్య మరింత

కిడ్నీ సమస్యలు ఉన్నాయా.. వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువ అవుతుంది సుమా.!


మూత్రసానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న అవి ఎండాకాలంలో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మధ్య అవసరం లేదంటే సమస్య మరింత ఎక్కువ దీర్ఘకాలం వేధిస్తుందని తెలుస్తుంది.

Chronic kidney disease (CKD)

సాధారణంగా ఎండాకాలంలో శరీరంలో ఉండే పలు రకాలు అనారోగ్యాలు మరింత ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో కిడ్నీలకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఎండా కాలంలో విపరీతంగా వేధిస్తాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలున్నవాళ్లతోపాటు లేనివాళ్లు కూడా వేసవిలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వాతావరణంలోని వేడి మూత్రాశయ వ్యవస్థని అస్తవ్యస్థం చేస్తుంది.

తగినంత నీరు అవసరం..

ఏ కాలంలో అయినా శరీరానికి కావలసినంత నీరు హత్య అవసరం ఇందులో ముఖ్యంగా ఎండాకాలంలో  డీహైడ్రేషన్‌, పన్లో పడి నీళ్లు తాగకపోవటం, సమతులాహారం తీసుకోకపోవటం, దాహార్తికి నీళ్లకు బదులుగా ఏరేటెడ్‌ డ్రింక్స్‌ మీద ఆధారపడటం వల్ల వేసవిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు అనే రెండు ప్రధాన సమస్యలు తలెత్తుతాయి. 

అయితే ఎలాంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారైనా వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఉప్పు, మాంసాహారం తగ్గించాలి. వారానికి ఒకటి రెండు సార్లు తక్కువ మోతాదులో మాంసాహారం తినటం వల్ల ప్రమాదం ఉండదు. కానీ ఎక్కువగా తింటే మాత్రం నష్టం వాటిల్లుతుంది.

పాలకూర, టమాటా తినటం వల్ల కిడ్నీ స్టోన్స్‌ వస్తాయాని చెప్పలేం. కానీ కిడ్నీ స్టోన్స్‌ వచ్చే అవకాశం ఉన్నవాళ్లు వేసవిలో వీటికి దూరంగా ఉండటమే మంచిది. 

ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి సమస్యతో బాధపడుతున్న వారు ఆహారంలో జీడిపప్పు, బాదం పప్పులు కూడా తగ్గించాలి. పాలు తాగితే వాటిలోని కాల్షియం వల్ల మూత్రపిండాల్లో రాళ్లొస్తాయని అనుకుంటూ ఉంటారు. ఆహారం ద్వారా శరీరానికందే కాల్షియంతో రాళ్లు తయారయ్యే అవకాశాలు తక్కువ.

మాత్రల రూపంలో కాల్షియం శరీరంలోకి చేరితే అది మూత్రపిండాల్లో రాయిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యుల సలహా తీసుకోకుండా కాల్షియం టాబ్లెట్లు తినకూడదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.