Women heart Problems : మహిళల్లో గుండె సమస్యలు, లక్షణాలు, జాగ్రత్తలు.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
Women heart Problems : అవిశ్రాంతంగా పనిచేయడం, స్ట్రెస్ మహిళల్లో ఆరోగ్య సమస్యలతోపాటు గుండె సమస్యలు కూడా అధికమవుతున్నాయి. హార్వర్డ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. మహిళల్లో గుండె జబ్బుల వలన మరణాలు పెరుగుతున్నాయని..

Women heart Problems : పెళ్లి కావడం ఆలస్యం మహిళలకు కొత్త కొత్త బాద్యతలు వచ్చి పడతాయి. అదే వర్కింగ్ ఉమెన్ అయితే ఆ బాధ వర్ణణాతీతం. ఒకవైపు ఇంటి పని చేసుకొని ఆఫీసుకు వెళ్ళాలి. లేచింది మొదలు పరుగో పరుగు అన్నట్లు క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిచిపోతుంది రోజంతా. అటు ఉద్యోగాలు, ఇంట్లో పని, పిల్లలు ఇలా తీరిక లేని సమయాన్ని గడుపుతున్నారు. తన కోసం సమయం కేటాయించలేనంత బిజీ జీవితం.. వ్యాయామం, నడకకు తీరిక ఎక్కడిది.
అవిశ్రాంతంగా పనిచేయడం, స్ట్రెస్ మహిళల్లో ఆరోగ్య సమస్యలతోపాటు Heart Problems కూడా అధికమవుతున్నాయి. హార్వర్డ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. మహిళల్లో గుండె జబ్బుల వలన మరణాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా అత్యధిక మరణాల్లో గుండె జబ్బులు ప్రధాన కారణమని పేర్కొంది. గుండె జబ్బు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు కానీ.. అవగాహన లేకపోవడం వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపింది.
ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ మహిళల్లో కార్డియోవాస్కులర్ రిస్క్‌కి ముఖ్యమైన కారణంగా నిలుస్తుంది. తక్కువ హెచ్‌డీఎల్, అధిక ట్రైగ్లిజరైడ్‌లు మాత్రమే 65 ఏళ్లు పైబడిన మహిళల్లో గుండె జబ్బు వలన మరణాలు సంభవించడం జరుగుతుంది. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే గుండె జబ్బులు పెరుగుతున్నాయని అన్నారు. రెండవది.. 45 ఏళ్ల తర్వాత, పురుషులు, స్త్రీలలో హృదయ సంబంధ సమస్యలు దాదాపు ఒకే విధంగా ఉంటాయిని అపోహపడుతున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు తక్కువ అని అంచనా వెయ్యడం తప్పు అని పరిశోధనల్లో తేల్చారు. మహిళల్లో గుండెపోటుకు సంబంధించిన సాధారణ లక్షణాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయని తేలింది.
మహిళల్లో గుండెపోటు లక్షణాలు
- అలసట
- భోజనం తర్వాత అసౌకర్యంగా ఉన్న భావన
- దవడలో, శరీర వెనుక భాగంలో కూడా ఒక విచిత్రమైన నొప్పి
- ఎడమ, కుడి చేతిలో నొప్పి
- మెట్లు ఎక్కేటప్పుడు, ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఊపిరి ఆడకపోవడం
- తిన్న తర్వాత కడుపు నొప్పి లేదా పొత్తికడుపు పైభాగంలో నొప్పి గుండె సంబంధిత సమస్య వల్ల కావచ్చు
- ఎటువంటి కారణం లేకుండా విపరీతంగా చెమటలు పట్టడం..
పై లక్షణాలు గనక కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి మీకు ఎదురవుతన్న సమస్యలను వివరించడం మంచిది.
ఊబకాయం, రక్తపోటు, గ్లూకోజ్ హెచ్చుతగ్గులు, తక్కువ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్‌లు.. గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వచ్చే అవకాశాలను పెంచుతాయని అధ్యయనం తెలిపింది. మహిళలకు చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి మెటబాలిక్ సిండ్రోమ్ అత్యంత ముఖ్యమైన కారంణం కాగా, మధుమేహం రెండవ కారణంగా ఉంది. ఈ రెండు కారణాల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం పొంచిఉంది. అందుకే 40 సంవత్సరాల వయస్సు దాటిన నుంచి లిపిడ్ ప్రొఫైల్ ( LIPID Profile ) టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. లిపిడ్, బ్లడ్ షుగర్, KFT, LFT వంటి వాటిని పరీక్షించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే కుటుంబంలో స్త్రీ తప్పనిసరిగా కార్డియాలజిస్ట్‌ని సంప్రదించాలి.
మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి
- మహిళకు 30-35 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలను నిర్ధారించుకోవడానికి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి.
- ఐటీ రంగంలో పనిచేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి, సమయ పాలనలేని భోజనం, నైట్ షిఫ్ట్ వలన ఆనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రంతా పని చేయడం, ఉదయం నిద్రపోవడం వల్ల కూడా గుండె జబ్బులకు దారితీస్తుంది.
- మధుమేహం ఉన్న స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ వంటివి సైలెంట్ కిల్లర్స్ గా పరిగణించాలి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను చెక్-అప్ కి వెళ్ళడం మంచిది. నిర్లక్ష్యం వహిస్తే అది గుండె పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
- జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారం, స్వీట్లు తినడం మానుకోండి.. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.. దాని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
- మహిళలు ఆందోళన లేదా ఒత్తిడి కారణంగా తగినంత నిద్ర పొందలేక ఒత్తిడికి గురవుతారు. అది కూడా గుండె సమస్యలకు దారి తీస్తుంది.
ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే మాత్రం శరీరానికి తప్పనిసరిగా వ్యాయామాలు, యోగాలు అవసరం. క్రమం తప్పకుండ వాకింగ్ , వ్యాయామాలు చెయ్యాలి.