Heat rashes: చెమటకాయలతో శరీరం మండిపోతుందా.. ఈ చిట్కాలతో అన్ని మటుమాయం!

వేసవికాలం లో ఎండలు దంచేస్తున్నాయి. చెమట ఎక్కువగా పట్టేవారికి మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. వీరికి చర్మంపై Heat rashes ఎక్కువగా వస్తూ ఉంటాయి.. వీటినే చెమట పొక్కులు అంటారు.

Heat rashes: చెమటకాయలతో శరీరం మండిపోతుందా.. ఈ చిట్కాలతో అన్ని మటుమాయం!
Remedy for Heat rashes


వేసవికాలం లో ఎండలు దంచేస్తున్నాయి. చెమట ఎక్కువగా పట్టేవారికి మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. వీరికి చర్మంపై Heat rashes ఎక్కువగా వస్తూ ఉంటాయి.. వీటినే చెమట పొక్కులు అంటారు. అయితే వీటికి తగినట్టు ఎక్కువగా పౌడర్లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటికి బదులుగా తేలికగా ఇంటిలోనే ఎలా తగ్గించుకోవచ్చు ఒకసారి తెలుసుకుందాం.

శరీరంపై విడుదలైన చెమట బయటకి పోయే అవకాశం లేనప్పుడు లేదా మరింత ఎక్కువ చెమట శరీరంపై నిల్వ ఉండిపోయినప్పుడు ఈ చెమట పొక్కులు వస్తూ ఉంటాయి. వీటితో శరీరం అంతా మంట పుట్టడంతో పాటు ఎర్రగా చిన్న చిన్న పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చిన్నవిగా కనిపించిన చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.

చాలామందికి ఈ చెమటకాయల్ని స్కిన్ ఎలర్జీ లాగా గోకే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవి తగ్గిపోయాక సైతం శరీరంపై మచ్చలు ఏర్పడతాయి అందుకే అలా చేయకూడదు.

ఎండాకాలంలో రోజు రెండు పూటలా చల్లటి నీళ్లు స్నానం చేయాలి. ఈ చెమట పొక్కులు ఉన్నవారు కాస్త ఎక్కువ నీరు బకెట్లో తీసుకొని శరీరంపై గుమ్మరించుకోవాలి.

బయట చెట్లు, మొక్కలు ఎక్కువగా ఉండే వాతావరణంలో గడపడం అలవాటు చేసుకోవాలి. కేవలం ఇలా అవకాశం లేనప్పుడు మాత్రమే ఫ్యాన్, ఏసీలని ఆశ్రయించాలి.

అలాగే ఎండాకాలంలో ఎక్కువగా తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. చల్లని నీటిలో ముంచిన బట్టని వేడి దద్దర్లు, దాని చుట్టూ అద్దడం వల్ల నొప్పి, చికాకు తగ్గుతుంది.

కలబంద శరీరానికి స్వాంతన కలిగిస్తుంది చెమట పొక్కులు ఎక్కువగా ఉన్నవారు కలబందని రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

సహజంగా దొరికే గంధపు చక్కని నూరి వాటిపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

చెమటకాయలు ఎలా తగ్గించుకోవాలంటే..

  • గంధపు చక్కని నూరి నీటిలో కలిపి రాసుకోవాలి..
  • కలబంద గుజ్జును అప్లై చేయాలి..
  • రెండు పూటలా స్నానం చేసి కాటన్ దుస్తులు ధరించాలి..
  • పాలిస్టర్ నైలాన్ వంటి దుస్తులు చెమటను గ్రహించవు అందుకే వీటికి దూరంగా ఉండాలి.
  • తగ్గేంత వరకు ఎండలో తిరగడం తగ్గించాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.