పిల్లల్లో దగ్గును తగ్గించటానికి ఏం చేయ్యాలంటే.. !

చిన్నపిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల పిల్లలు తొందరగా వ్యాధులకు

పిల్లల్లో దగ్గును తగ్గించటానికి ఏం చేయ్యాలంటే.. !


చిన్నపిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల పిల్లలు తొందరగా వ్యాధులకు గురవుతూ ఉంటారు అందులో ముఖ్యంగా జలుబు దగ్గు Cough in Children  వంటి సమస్యలతో బాధపడతారు అయితే ఈ సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని తెలుస్తోంది.. 

పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా అది తీవ్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే వారికి తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండదు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్య బారిన పడినప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. అంతేకాకుండా ముభావంగా ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తారు. ఇవన్నీ తల్లిదండ్రుల్ని మరింత గందరగోళానికి గురిచేస్తాయి. అయితే ఈ సమయంలో భయపడకుండా తేలికగా వారి అనారోగ్యాన్ని తగ్గించగలగాలి. అలాగే దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి..  
 
దగ్గు సమస్య వచ్చినప్పుడు గొంతుతో పాటు పొట్ట భాగంలో కూడా విపరీతంగా నొప్పి వస్తుంది.. ఈ సమయంలో కొన్ని రకాల పండ్లను ఇవ్వకూడదని అందులో ముఖ్యంగా.. ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, లిచీలను అసలే ఇవ్వకూడదని నిపుణులు సలహానిస్తున్నారు. అలాగే స్ట్రాబెర్రీలు హిస్టామిన్ ను విడుదల చేస్తుంది. ఇది దగ్గును కలిగిస్తుంది. ఇప్పటికే దగ్గు ఉంటే అది మరింత ఎక్కువ అవుతుంది. ఇకపోతే ద్రాక్ష, లిచీల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిదని తెలుస్తోంది.. 

What are Some Causes of Persistent Cough in Children?

అలాగే ఈ సమయంలో బయట దొరికే ఎలాంటి ఆహారాన్ని ఇవ్వకపోవడం మంచిది అంతే కాకుండా అవిపరితంగా రంగులు పూసి అమ్మే చిరు తిళ్లకు దూరంగా ఉంచాలి వీటితోపాటు క్యాండీలు, ఐస్ క్రీం, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, క్యాండీలు, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. 

పిల్లలు ఎలాంటి అనారోగ్యం బారిన పడిన వారిని బయటకు తీసుకువెళ్లక పోవడమే మంచిది. ముఖ్యంగా అధికంగా దుమ్ము ఉండే స్థలాల్లో తిప్పకపోవడమే మంచిది. దీని వలన విపరీతంగా దగ్గు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎయిర్ కండిషనర్ ఉన్న గదుల్లో పడుకోబెట్టకూడదు. దుమ్ము ధూళి ఉండే ప్రదేశాల్లో తిప్పకుండా వారు తిరిగే ప్రదేశాలను చాలా శుభ్రంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తూ పిల్లలకు మంచి ఆహారాన్ని ఇవ్వటం వల్ల తొందరగా అనారోగ్యం బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.