ప్రియమైన వారితో నిద్రించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!

మనకు నిద్రపోవడం వల్ల బాడీకి ఎనర్జీ అవుతుంది.. మొత్తం యాక్టివ్‌ అయిపోతాం.. ఈ విషయం తెలిసిందే.. కానీ నిద్రపోయిన ప్రతిసారి ఇలా జరగదు.. హాయిగా నిద్రపోయినప్పడే అలా జరుగుతుంది. డిస్టబెన్స్‌ లేకుండా పడుకోవాలి అంటే.. మనకు సుఖమైన నిద్రపట్టాలి.. మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు కంటే.

ప్రియమైన వారితో నిద్రించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!


మనకు నిద్రపోవడం వల్ల బాడీకి ఎనర్జీ అవుతుంది.. మొత్తం యాక్టివ్‌ అయిపోతాం.. ఈ విషయం తెలిసిందే.. కానీ నిద్రపోయిన ప్రతిసారి ఇలా జరగదు.. హాయిగా నిద్రపోయినప్పడే అలా జరుగుతుంది. డిస్టబెన్స్‌ లేకుండా పడుకోవాలి అంటే.. మనకు సుఖమైన నిద్రపట్టాలి.. మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు కంటే.. మీ ప్రియమైన వారితో పడుకుంటే.. చాలా ప్రయోజనాలు ఉన్నాయట.. మనసుకు నచ్చిన వాళ్లు పక్కనే ఉంటే.. ఆ ఆనందమే వేరు. ఒంటరిగా పడుకునే వారితో పోల్చి చూస్తే, జంటగా నిద్రపోయే వారిలో నిద్రలేమి సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

మీరు ఒంటరిగా పడుకున్నప్పుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే స్లీప్ జెర్క్స్ మిమ్మల్ని మేల్కొల్పవచ్చు. భవిష్యత్తుపై బెంగ, జీవితంలో జరిగిన చేదు సంఘటనలు గుర్తుకు వస్తాయి.. అనవసరపు భయాందోళనలు, పీడకలలతో మీకు నిద్రాభంగం కలగవచ్చు. అదే సమయంలో భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు మీరు ఒంటరి కాదు, మీకు జీవితంలో ఒక భరోసా ఉందనే భావన వస్తుంది. మీరు ప్రశాంతమైన మనసుతో నిద్ర పోగలుగుతారు. మీ నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. వారు గురకపెట్టి మీ నిద్రను పాడు చేయనంత వరకు మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. 

మీకు ఇష్టమైన భాగస్వామితో నిద్రించడం మీ బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్‌ రిలీజ్‌ అవుతాయి. అవేంటంటే.. 

ఆక్సిటోసిన్- ఆక్సిటోసిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచే ప్రేమ హార్మోన్.

సెరోటోనిన్- ఈ హార్మోన్ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.

నోర్పైన్ఫ్రైన్- ఇది నిద్రను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని సమతుల్యం చేస్తుంది.

వాసోప్రెసిన్- ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది, కార్టిసాల్‌ను తగ్గిస్తుంది.

ప్రొలాక్టిన్- ఈ హార్మోన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.