Stress in pregnancy : గర్భిణీలు ఒత్తిడిని ఎలా జయించాలంటే.. !

Stress in pregnancy  : తల్లి కాబోతున్న ప్రతి మహిళ ఎన్నో ఆలోచనలతో సతమతమవుతుంది. మారిపోతున్న జీవన శైలి ఆరోగ్య పరిస్థితులతో మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతుంది. అలాగే డెలివరీ, పుట్ట పోయే బిడ్డ వంటి విషయాల్లో సైతం ఉండే ఒత్తిడిని ఎలా జయించాలంటే.. 

Stress in pregnancy : గర్భిణీలు ఒత్తిడిని ఎలా జయించాలంటే.. !
How pregnant women can overcome stress


Stress in pregnancy  : తల్లి కాబోతున్న ప్రతి మహిళ ఎన్నో ఆలోచనలతో సతమతమవుతుంది. మారిపోతున్న జీవన శైలి ఆరోగ్య పరిస్థితులతో మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతుంది. అలాగే డెలివరీ, పుట్ట పోయే బిడ్డ వంటి విషయాల్లో సైతం ఉండే ఒత్తిడిని ఎలా జయించాలంటే.. 

తల్లి కాబోతున్న మహిళలకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం. ఈ సమయంలో భర్త అత్తమామలు తల్లిదండ్రులు వంటి వారందరూ ఆమెను మానసికంగా సిద్ధం చేయాలి.. ఎలాంటి సమస్యలు రాకుండా అంతా సక్రమంగా జరుగుతుందని భరోసా ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నీతో ఉంటాము అని చెబుతూ..  చుట్టూ ఉండే వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాలి. వీలైతే ఇంకాసేపు నవ్వుతూ మాట్లాడించడం.. అందరూ కూర్చొని మాట్లాడుకోవడం.. సాయంత్రం సమయాల్లో వాకింగ్ కి వెళ్ళటం వంటివి చేయడం వల్ల ఒత్తిడి దరిచేరదు.. 

ఈ సమయంలో పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం వైద్యుల సలహా మేరకు తృణధాన్యాలు, లేత మాంసాలు, తాజా పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, చిక్కుళ్ళు, గింజలను అందించాలి. సమతుల్యమైన ఆహారాన్ని అందించాలి. ఆహార పదార్థాలు తల్లి బిడ్డకు అసలు మంచివి కాదు వీటికి దూరంగా ఉండాలి.. 

అలాగే తగినంత సమయం నిద్రకూ కేటాయించాలి. గర్భధారణ సమయంలో ఆ తర్వాత కూడా నిద్ర ఎంతో అవసరం. అలాగే ముఖ్యంగా డెలివరీ అయ్యాక తల్లులు నిద్రలేక సతమతమవుతారు. బిడ్డను ఎలా చూసుకోవాలి అనే కంగారు ఒకవైపు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం మరొకవైపు కావడంతో శరీరంలో జరిగే మార్పులను అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో కచ్చితంగా కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం.. ఆందుకే ఆమెను తగినంత నిద్రపోయే విధంగా చూసుకోవాలి.  అలాగే అప్పుడే పుట్టిన బిడ్డకు జ్వరం దగ్గు వంటి సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి.. వీటన్నిటి విషయంలో బాధ్యత తీసుకోవడంతో ఆమెకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది. 

రోజు ఎంతో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. ఇదే అలవాటును ప్రసవానంతరం కూడా కొనసాగించాలి. ఈ సమయంలో మరి ఇబ్బందిగా అనిపిస్తే రోజుకి అరగంట అయినా తేలికపాటి నడకా వంటి వ్యాయామం చేయాలి. అలాగే గర్భధారణ సమయంలో న్యాయమాలు చేయడం వల్ల సుఖ ప్రసవం అయ్యేందుకు వీలవుతుంది అయితే అధిక ఒత్తిడికి గురికాకూడదు. 

అలాగే మొదటిసారి తల్లి అవుతున్న వారికి మరింత ఒత్తిడి ఉంటుంది బిడ్డ సంరక్షణ విషయంలో తల్లడిల్లిపోతారు. అందుకే ఈ సమయంలో అన్నీ తెలిసిన పెద్దలను వెంట ఉంచుకోవడం మానసిక ప్రశాంతత ఉన్నచోట గడపడం ఎంతో అవసరం..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.