తేలికగా ఎలా బరువు తగ్గాలంటే.. !

ఊబకాయం ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా చిన్న వయసు నుంచే దీన్ని బారిన పడటం ఇబ్బంది కలిగించే విషయమే. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే Weight Control లో ఉంచుకొవ‌చ్చ‌ని తెలుస్తోంది..

తేలికగా ఎలా బరువు తగ్గాలంటే.. !


ఊబకాయం ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా చిన్న వయసు నుంచే దీన్ని బారిన పడటం ఇబ్బంది కలిగించే విషయమే. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే   Weight Control లో ఉంచుకొవ‌చ్చ‌ని తెలుస్తోంది..

బరువును అదుపులో ఉంచాలి అంటే లైపో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇబ్బంది పడి అధికంగా వ్యాయామాలు చేయక్కర్లేదు. రోజు జీవితంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే తేలికగా బరువును అదుపు చేసుకోవచ్చు. ఎందుకు చేసే ప్రతి పనిలో ఏకాగ్రత ఉండాలి. బరువు తగ్గాలనే ఆలోచన ఉంచుకోవాలి.. దీనికోసం ఏం చేయాలి అంటే..

నిద్ర లేచిన గంట లోపే అల్పాహారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను మానేయకూడదు. దీనివలన కడుపులో విపరీతంగా గ్యాస్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే తేలికపాటి ఆహారాన్ని ఉదయం తీసుకోవాలి.. 

ఆకలి వేసిన ప్రతిసారి ఏదో ఒకటి తినేయటం కాకుండా భోజనానికి మధ్య కావలసినంత గ్యాప్ ఇస్తూ ఉండాలి. అలాగే మరి ఆకలి వేస్తే పండ్లను తీసుకోవడం మంచిది.. అలాగే హడావిడిగా భోజనాన్ని ముగించడం సరైన పద్ధతి కాదు ప్రశాంతంగా కూర్చొని ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి..

అలాగే భోజనాన్ని వీలైనంత చిన్న ప్లేట్ లో పెట్టుకొని తినడం వల్ల తెలియకుండానే తక్కువ తింటామని.. పూటకి ఎంతో కొంత తగ్గించవచ్చని తెలుస్తోంది.. అలాగే సిట్రస్ జాతి పండ్లను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలాగే డీప్ ఫ్రై లను అధిక మసాలా పదార్థాలను దూరంగా ఉంచడం వల్ల బరువు అదుపులో ఉంటుంది ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు ఇవన్నీ అదుపులో ఉంచడానికి చక్కగా పనిచేస్తాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.