Kidney Stones ఎందుకు వస్తాయి? ఎలా నివారించాలంటే.. !
Kidney Stones : కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం

Kidney Stones : కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం.. ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో రోజు తీసుకునే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కిడ్నీలకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య సైతం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఎందుకు గల కారణాలు దానిని ఎలా అదుపు చేయాలి అంటే..
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్యమైన కారణం సరిపడాంతా నీరు తీసుకోకపోవడం. దీని వలన శరీరంలో వ్యర్ధాలు బయటకి పోవు. ఇవి కిడ్నీలో రాళ్ల లాగా మారుతాయి.. అలాగే తక్కువగా మూత్ర విసర్జన చేయటం వల్ల యూరిన్లో లవణ పదార్థాల సాంద్రత పెరిగిపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే రక్తంలో, మూత్రంలో యూరిక్ ఆసిడ్ కాల్షియం ఆక్సలైటువంటి లవణాలు అధికంగా బయటకు పోవడం వల్ల యూరిన్ తక్కువగా తయారవుతుంది. దీని వలన కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది..
అలాగే అధిక బరువు ఉన్నా, డయాబెటిస్, వ్యాయామం చేయకపోయినా, నీళ్లు తక్కువగా తాగినా, మాంసాహారం అధికంగా తిన్నపుడు, స్టిరాయిడ్‌లను ఎక్కువ మోతాదులో తీసుకున్నపుడు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయకపోయినా, నిద్రలేమి, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నా, కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు ఏర్పడవచ్చు.
కిడ్నీలో రాళ్లు ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది.. కొన్ని సందర్భాలలో ఈ నొప్పిని భరించడం చాలా కష్టతరమైన పని.. అయితే ఈ సమస్యను అదుపు చేయకపోతే తీవ్రంగా మారే అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకోసం రోజూ ఖచ్చితంగా ఆరు నుంచి పది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి.. అలాగే బార్లీ గింజల ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కొన్ని పదార్థాలను తీసుకోవడం మానేయాలి అందులో ముఖ్యంగా పాలకూరతో టమాటా వంటి ఆహార పదార్థాలను తినకూడదు.. ఉప్పును కారం మసాలా సంబంధిత పదార్థాలను తక్కువగా తీసుకోవాలి కాఫీ టీలను సైతం తగ్గించాలి.. అవసరం లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు..