Fresh meat : మటన్ కొనడానికి వెళ్తున్నారా.. అయితే మ‌ట‌న్‌ ముదురుదా.. లేతదా ఇలా గుర్తించాలి..

Food Adulteration : చిన్న చిన్న వస్తువుల్లోనూ కల్తీనే. చిన్న పానీ పూరీ బండి నుంచి పెద్ద పెద్ద 5 నక్షత్రాల హోటళ్లు వరకూ అంతా కల్తీనే. అడుగెస్తే కల్తీ. ఆహారం విషయానికి వస్తే తాజా పదార్థాలు దొరకడమే గగనమైపోయింది. అసలు మానవ జీవితానికి ఇంధనమే ఆహారం. 

Fresh meat : మటన్ కొనడానికి వెళ్తున్నారా.. అయితే మ‌ట‌న్‌ ముదురుదా.. లేతదా ఇలా గుర్తించాలి..
Identify fresh meat


Food Adulteration  : ప్రస్తుతం ఎటు చూసినా, ఎక్కడి కెళ్లినా కల్తీ. ప్రపంచంలోనే కల్తీ అనేది వేళ్లూనుకుపోయింది. 

ఎన్ని రైడ్ లు జరిగినా, ఎన్ని సార్లు దుకాణాలను సీజ్ చేసినా కల్తీ మాత్రం ఆగట్లేదు. అంతలా పాతుకుపోయింది. రోజు చదివే న్యూస్ పేపర్లలోనూ ఆహార కల్తీలకు సంబంధించి వార్తలు చదువుతూనే ఉన్నాం. మనం తింటున్న ఆహారం, కొంటున్న ఆహారం, అన్నింటీలోనూ కల్తీ పేరుకుపోయింది. చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.

చిన్న చిన్న వస్తువుల్లోనూ కల్తీనే. చిన్న పానీ పూరీ బండి నుంచి పెద్ద పెద్ద 5 నక్షత్రాల హోటళ్లు వరకూ అంతా కల్తీనే. అడుగెస్తే కల్తీ. ఆహారం విషయానికి వస్తే తాజా పదార్థాలు దొరకడమే గగనమైపోయింది. అసలు మానవ జీవితానికి ఇంధనమే ఆహారం. అలాంటి ఇంధనమే కల్తీ అయితే.....మనుగడ ఎలా సాధ్యమవుతుంది?

ఇక మార్కెట్లో తాజా మాంసం లభించడమే కష్టమైపోయింది. ఒక్కోసారి కుళ్లిపోయిన మాంసం అమ్మేస్తుంటారు. చనిపోయిన కోళ్లను, మేకలు, గొర్రెలను విక్రయించేస్తున్నారు. ఎప్పుడో కోసి......ఫ్రీజర్ లో ఉంచి మార్కెట్లో అమ్నుతున్నారు. అది మనం తెలియక కొనేస్తుంటాం.

మనం కొంటున్న మాంసం తాజానో కాదో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు

  • మటన్‌, చికెన్‌ తాజాగా లేకపోతే పాలిపోయినట్టు కనిపిస్తుంది.
  • మటన్ నుంచి రక్తం, నీరు కారుతుంటే దాన్ని తీసుకోకూడదు.
  • ఎరుపు రంగులో ఉండే మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అది తాజా కాదని గుర్తించాలి.
  • బోన్‌లెస్ మటన్ కంటే బోన్ మటన్ రుచిగా ఉంటుంది. మంచి పోషకాలు కూడా ఉంటాయి.
  • అంతేకాకుండా ఆన్‌లైన్‌లో మటన్‌ ఆర్డర్‌ పెట్టకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  • ఇంకో విషయం...మేక తోకలు గట్టిగా ఉన్నాయా లేదా...లేకపోతే లాగితే ఊడిపోయేలా ఉన్నాయా అనేది చూసుకోవాలి. లాగిన కూడా రాకపోతే అది తాజా మటన్ అని గుర్తించాలి.
  • కొన్నిసార్లు తాజా మటన్ లా ఉంచేందుకు గమ్ తో అంటించేస్తుంటారు.

హోటళ్లలో కూడా ఎప్పుడో వండిన అన్నాన్ని వేడిచేసి ఇచ్చేస్తారు. బిర్యానీల కంటే ఫ్రైడ్ రైస్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వాటిని ఫ్రై చేయడం వల్ల అన్నం గట్టిపడిపోతుంది. చికెన్ కూడా ఫ్రీజర్ లో పెట్టి ఉంచేస్తుంటారు. ఎన్ని తనిఖీలు చేసిన యజమానులు మారడం లేదు. ఎప్పుడో ఒకసారి అంటే ప‌రవాలేదు. రోజు అంటే ఆరోగ్యం నాశనం కావడం తథ్యం. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.