Fertility : సంతాన సామర్థ్యాన్ని పెంచే చిట్కాలు.. మీరు ఇలానే చేస్తున్నారా..?

fertility : జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వలన వంధ్యత్వాన్ని నియంత్రించవచ్చు. గర్భం కోరుకునే జంటలకు మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడానికి ఈ చిట్కాలను పాటించండి..

Fertility : సంతాన సామర్థ్యాన్ని పెంచే చిట్కాలు..  మీరు ఇలానే చేస్తున్నారా..?


fertility : పెళ్లైన తర్వాత పిల్లలు కలగడం అనేది ఇప్పుడు అంత చిన్న విషయం కాదు.. ఎందుకంటే.. మన జీవనశైలి వల్ల అటు పురుషులు, స్త్రీలు ఇద్దరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే కారకాలు అండోత్సర్గము, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) , లూపస్, గర్భాశయ అసాధారణతలు మొదలైనవి ఉంటున్నాయి. పురుషుల విషయంలో తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్, తక్కువ స్పెర్మ్ కౌంట్ అలాగే సల్ఫసాలజైన్ వంటి కొన్ని ఓవర్-ది-కౌంటర్ మందులు వంధ్యత్వానికి దారితీయవచ్చు. సంతాన సమార్థ్యాన్ని పెంచే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం..

సంతాన సామర్థ్యాన్ని పెంచే చిట్కాలు..

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వలన వంధ్యత్వాన్ని నియంత్రించవచ్చు. గర్భం కోరుకునే జంటలకు మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడానికి ఈ చిట్కాలను పాటించండి..

చురుకైన జీవనశైలిని అనుసరించండి..

చురుకైన జీవనశైలిని అవలంబించడం వలన సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. మీ శరీరాన్ని అర్థం చేసుకొని, మీ సామర్థ్యానికి తగినట్లుగా వ్యాయామాలు చేయండి, యోగాసనాలు సాధన చేయండి. ఎక్కువ అవసరం లేదు.. రోజులో 30 నిమిషాలు చేస్తే చాలు..

ఒత్తిడి, ఆందోళన వల్ల స్త్రీలు, పురుషులు స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు.. ధూమపానం వల్ల.. శ్వాసకోశ రుగ్మతలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులనే కాకుండా, ఇది పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తుంటే, ధూమపానం పూర్తిగా మానేయండి.

మధ్యపానం కూడా అంతే.. ఇప్పటి వరకూ చేశారు..కానీ ఇక నుంచి అయినా మానేయండి.. అధిక మద్యపానం అండోత్సర్గము రుగ్మతలు, శరీరంలో వాపులు, బలహీనమైన పేగు, కాలేయ పనితీరు మందగించడం వంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మద్యపానానికి దూరంగా ఉండడాన్ని పరిగణించండి.

ఒత్తిడి, ఆందోళనలు వ్యక్తుల సంతానోత్పత్తి స్థాయిలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఒత్తిడిని నియంత్రించుకోండి. వీలైనంత వరకూ ఆనందంగా ఉండేలా మీ లైఫ్‌స్టైల్‌ను ప్లాన్‌ చేసుకోండి. ప్రశాంతమైన జీవనం గడపండి. ధ్యానం ఆచరించడం వలన ఒత్తిడి తగ్గుతుంది.

మీరు తీసుకునే విశ్రాంతి మీ శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. నిద్ర మనిషికి చాల అవసరం.. ఇది తక్కువైనా, ఎక్కువైనా సమస్యే.. సరిపడా నిద్ర మిమ్మల్ని రిఫ్రెష్‌గా, చురుకుగా ఉంచుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. మీరు తగినంత నిద్ర పోవడం వలన మీ సంతానోత్పత్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.


మొదట మీరు మీ లైఫ్‌స్టైల్‌ను ఇలా ప్లాన్‌ చేసుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.. మీలో ఏదైనా సమస్య ఉంటే.. దానికి తగ్గట్టు చికిత్స కూడా ప్రారంభించండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.