బాడీలో ఈ విటమిన్‌ లోపిస్తే.. లైంగిక ఆసక్తి తగ్గుతుంది తెలుసా..?

పెళ్లి తర్వాత.. ఆ జంట ఎంత సంతోషంగా ఉన్నారన్నది.. వారి సైక్స్‌ లైఫ్‌ బట్టే తెలిసి పోతుంది.. నిజానికి చాలా మంది దీని గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు.. మనిషిని స్వర్గం అంచుల వరకూ తీసుకెళ్లేది ఒక్క శృంగారం

బాడీలో ఈ విటమిన్‌ లోపిస్తే.. లైంగిక ఆసక్తి తగ్గుతుంది తెలుసా..?


పెళ్లి తర్వాత.. ఆ జంట ఎంత సంతోషంగా ఉన్నారన్నది..వారి సైక్స్‌ లైఫ్‌ బట్టే తెలిసి పోతుంది.. నిజానికి చాలా మంది దీని గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు.. మనిషిని స్వర్గం అంచుల వరకూ తీసుకెళ్లేది ఒక్క శృంగారం మాత్రమే. దీనివల్ల మానసిక , శారీరక ఆనందం రెండూ కలుగుతాయి. కోట్లు ఇచ్చినా రానీ కిక్‌.. సరైన రీతిలో రతి చేసి సంతృప్తి పొందినప్పుడు వస్తుంది. కానీ కొంతమందిలో ఆ ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. ఎందుకో కారణం వారికి కూడా తెలియదు. దీనివల్ల వైవాహిక బంధంలో కలతలు రావచ్చు. మీ పార్టనర్‌ ఇంట్రస్ట్‌ చూపించినప్పుడు మీరు చేయలేకుంటే అది రానురాను మీ రిలేషన్‌పై ఎఫెక్ట్‌ పడుతుంది.. లైంగికాసక్తి తగ్గడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కారణాల్లో ఒకటి విటమిన్ డి లోపం. అవును విటమిన్‌ డీ లోపిస్తే.. లైంగిక ఆసక్తి తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ డి ను ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. అలాగే ‘సెక్స్ విటమిన్’ అని కూడా అంటారు. 

అనేక అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. విటమిన్ డి లోపం వల్ల వ్యక్తుల సెక్స్ డ్రైవ్‌లో మార్పులు వస్తాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది.. ఇది లోపిస్తే లైంగికాసక్తి తగ్గిపోతుంది. విటమిన్ డి లోపం కేవలం పురుషులను మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మహిళల్లో తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలకు కూడా ఇదే కారణం అవుతుంది. దీని వల్ల వారిలో కూడా విటమిన్ డీ లోపం వస్తుంది. విటమిన్ డి జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త నాళాల గోడల లైనింగ్‌ను మెరుగుపరచడం ద్వారా ఇది లైంగిక జీవితాన్ని రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.. రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి వాపును తగ్గిస్తుంది. 

స్త్రీలలో..

స్త్రీలలో విటమిన్ డి లేక ఇతర కారణాల వల్ల ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి సెక్స్ కోరికలు తగ్గిపోతాయి.. జననేంద్రియ గోడలోని కండరాలు ఆరోగ్యంగా ఉండవు. ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల జననేంద్రియాలు పొడిగా మారిపోతాయి. 

పురుషుల్లో

విటమిన్ డి లోపం వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. వెంట్రుకలు ఊడిపోవడం, కండరాలు కరిగిపోవడం, ఛాతీ భాగం పెరగడం వంటివన్నీ దీని లోపం వల్లే జరుగుతాయి. తక్కువ సెక్స్ డ్రైవ్‌తో బాధపడుతున్న పురుషులు రెండు వారాల పాటూ రోజుకు 30 నిమిషాలు ఉదయం పూట ఎండలో నిలబడితే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. 

సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ శరీరంలో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఎండ బారిన పడి దెబ్బతినకుండా కాపాడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, మెలనిన్, సెక్స్ హార్మోన్లు ఒకదానికొకటి తమ పనితీరును మెరుపరుచుకోవడానికి సహకరించుకుంటాయని కూడా నిరూపించబడింది.. విటమిన్‌ డీ లోపం మీ ఆరోగ్యాన్నే కాదే.. ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.