తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే.. పిల్లలకు కూడా వస్తుందా..?

షుగర్‌ , బీపీ ఇవి అంటువ్యాధులు కావు.. కానీ వారసత్వంగా వచ్చే అవకాశం ఉన్న వ్యాధులు. అంటువ్యాధులకన్నా డేంజర్‌.. వాటిని జాగ్రత్తలు తీసుకుంటే మన దాకా రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇవి మీ ఇష్టం వచ్చినట్లు మీరు బతికేస్తున్నా అవి వచ్చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక ఆహార నియమాల్ని అనుసరించాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.

తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే.. పిల్లలకు కూడా వస్తుందా..?


షుగర్‌ , బీపీ ఇవి అంటువ్యాధులు కావు.. కానీ వారసత్వంగా వచ్చే అవకాశం ఉన్న వ్యాధులు. అంటువ్యాధులకన్నా డేంజర్‌.. వాటిని జాగ్రత్తలు తీసుకుంటే మన దాకా రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇవి మీ ఇష్టం వచ్చినట్లు మీరు బతికేస్తున్నా అవి వచ్చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక ఆహార నియమాల్ని అనుసరించాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే పిల్లలకు కూడా వస్తుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై వైద్య నిపుణులు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసుకుందాం.
కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధిలో జన్యుశాస్త్రం చాలా బలమైన పాత్ర పోషిస్తుంది. ఇది మాత్రమే కాదు, మధుమేహం పర్యావరణ కారకాలు, జీవనశైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారంతో పాటు మితమైన వ్యాయామం మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.
How To Test Your Blood Glucose - Video Guide
టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లయితే, పిల్లలకి అది అభివృద్ధి చెందడానికి 8-14% అవకాశం ఉంది. మధుమేహం ఉన్న పిల్లలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే, ప్రమాదం దాదాపు 50 శాతం ఉంటుందట. మధుమేహం ఉన్న తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి అప్పటికే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారి ఆహార నియమాలపట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించాలి. పిల్లలు పెద్దవాళ్లు అయితే.. మీరే అన్నీ చూసుకోండి. ఎలాంటి ఒత్తిడి తీసుకోకూడదు. మద్యం , పొగాకుకు దూరంగా ఉండంటి. మీ పేరెంట్స్‌కు ఈ రకమైన వ్యాధులు ఉన్నాయి కాబట్టి మీరు ముందు నుంచే మంచి జీవనశైలిని పాటించండి. తక్కువ కొవ్వు, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
లావుగా ఉండటమే అన్ని రకాల సమస్యలకు కారణం. కాబట్టి బరువును ఎప్పుడూ కంట్రోల్‌గా ఉంచుకోవాలి. బరువు పెరగకుండా మితంగా ఆహారం తినండి, వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోండి. మంచి జీవనశైలి పాటిస్తే ఎలాంటి రోగాలు రావు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.