ఎంత వేలాడే పొట్ట అయినా ఈ మూడు వ్యాయామాలు డైలీ వేస్తే చాలు కరిగిపోతుంది..!
ఎంత వేలాడే పొట్ట అయినా ఈ మూడు వ్యాయామాలు డైలీ వేస్తే చాలు కరిగిపోతుంది..!
కష్టాలు చెప్పిరావు.. అలాగే పొట్టలు, ఈ అధిక బరువు కూడా.. ఒక లెవల్‌కు వచ్చాక కానీ మనకు తెలుస్తుంది.. లావు అవుతున్నాం అని.. పోనీ అప్పుడైనా మేల్కొంటారా అంటే లేదు.. మరీ పొట్ట ఎక్కువైపోయి.. మీ శరీరం మీద మీకే అసహ్యం వచ్చాక.. అప్పుడు స్టాట్ చేస్తారు.. అయితే జిమ్‌కు వెళ్లడం లేదా.. ఇంట్లోనే ఏదో ఒక కుస్తీపోట్లు పడటం.. ముందు సాధన అంటూ స్టాట్ చేస్తే
కష్టాలు చెప్పిరావు.. అలాగే పొట్టలు, ఈ అధిక బరువు కూడా.. ఒక లెవల్‌కు వచ్చాక కానీ మనకు తెలుస్తుంది.. లావు అవుతున్నాం అని.. పోనీ అప్పుడైనా మేల్కొంటారా అంటే లేదు.. మరీ పొట్ట ఎక్కువైపోయి.. మీ శరీరం మీద మీకే అసహ్యం వచ్చాక.. అప్పుడు స్టాట్ చేస్తారు.. అయితే జిమ్‌కు వెళ్లడం లేదా.. ఇంట్లోనే ఏదో ఒక కుస్తీపోట్లు పడటం.. ముందు సాధన అంటూ స్టాట్ చేస్తే.. ఫలితం ఏదో ఒక రోజు కచ్చితంగా వస్తుంది. మీకు ఎంత వేలాడే పొట్ట ఉన్నా సరే.. ఈ మూడు వ్యాయామాలను డైలీ చేయండి.. దిమ్మతిరిగిపోయే రిజల్ట్ మీ కళ్లముందు ఉంటుంది. రోజూ 3 వ్యాయామాలను 5 నిమిషాలకు ఒకటి చొప్పున కనీసం 15 నిమిషాల పాటు చేయాలి. దీంతో ఎంతటి వేళ్లాడే పొట్ట అయినా సరే కరిగిపోతుంది. పొట్ట భాగం అందంగా మారుతుంది.
వ్యాయామం – 1
నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులను వీపు కింద పెట్టాలి. కాళ్లను దగ్గరగా చేసి నిలువుగా పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ భంగిమలో 5 సెకన్ల పాటు ఉండాలి. తరువాత కాళ్లను కొద్దిగా కిందకు వంచాలి. 60 డిగ్రీల కోణంలో పెట్టాలి. మళ్లీ ఈ భంగిమలోనూ 5 సెకన్ల పాటు ఉండాలి. అనంతరం కాళ్లను ఇంకాస్త కొద్దిగా కిందకు వంచాలి. ఇప్పుడు 30 డిగ్రీల కోణంలో కాళ్లను పెట్టాలి. మళ్లీ 5 సెకన్ల పాటు ఉండాలి. ఇలా చేశాక కాళ్లను కిందకు దించి యథావిధిగా నేలపై ఉంచాలి. ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి. రోజూ చేస్తుంటే అలవాటు అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు చేయగలుగుతారు. వీలుంటే సమయాన్ని పెంచుతూ పోవాలి. రోజూ కనీసం 10 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
ఈ వ్యాయామం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి బాగా పడుతుంది. అక్కడి కండరాల్లో కదలిక వస్తుంది. ఆ భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా తగ్గించవచ్చు.
వ్యాయామం – 2
కాళ్లను 60 డిగ్రీల కోణంలో ఉంచినప్పుడు వాటిని దగ్గరగా పెట్టి గాల్లోనే సైకిల్ తొక్కినట్లు తొక్కాలి. 5 సెకన్ల నుంచి 10 సెకన్ల పాటు చేశాక కాళ్లకు కిందకు దించాలి. మళ్లీ కాళ్లను పైకి లేపి అలాగే చేయాలి. ఒక్కో కాలుతోనూ దీన్ని చేయ. ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి. కష్టంగా ఉందనుకుంటే ఆరంభంలో 2-3 నిమిషాలు చేయవచ్చు. తరువాత సమయాన్ని పెంచుతూ పోవాలి. కనీసం రోజుకు 10 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల కూడా పొట్ట దగ్గరి కొవ్వు వేగంగా కరిగిపోతుంది
వ్యాయామం – 3
వ్యాయామం 1 లో చెప్పినట్లే నేలపై వెల్లకిలా పడుకుని చేతులను వీపు కింద ఉంచాలి. అనంతరం కాళ్లను కొద్దిగా పైకి లేపి 60 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ భంగిమలో కాళ్లను దగ్గరగా పెట్టి వాటిని ఒకేసారి గుండ్రంగా చక్రం తిప్పినట్లు తిప్పాలి. ముందుగా కుడివైపు నుంచి ఎడమకు తరువాత ఎడమ వైపు నుంచి కుడివైపుకు కాళ్లను తిప్పాలి. ఇలా 5 సెకన్ల పాటు చేయాలి. దీన్ని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు చేసేలా ప్లాన్ చేసుకోండి.. ఈ వ్యాయామం వల్ల కూడా పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
వీటిని ఎలా చేయాలో వీడియోల ద్వారా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు నిజంగా పొట్ట తగ్గించుకోవాలి అంటే.. కచ్చితంగా ఈ మూడు వ్యాయామాలు సాధన చేయండి. ఒక్క నెల రోజుల్లోనే పొట్ట చాలా వరకు తగ్గిపోతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.
గమనిక :
ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణులను సంప్రదించండి.