కొంతమందికి ఎంత తిన్నా ఇంకా తినాలని కోరిక ఉంటుంది. హ్యాపీగా ఫుడ్ అంతా లాగించేస్తారు. మరికొందరు మితంగా తింటారు. ఎంత ఇష్టమైన ఫుడ్ ముందు పెట్టినా వాళ్లు రోజూ తినే అంతే తింటారు. ఎక్కువగా తింటే అది అరిగి సావదు. గ్యాస్ వల్ల నానా ఇబ్బంది.. ఇదంతా ఎందుకు కొద్దిగా తింటే పోలా అని పాపం అప్పుడు సగం ఆకలితోనే లేస్తారు. ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండటం వల్ల మనం తినొచ్చు, అలా అని బరువు కూడా పెరగరు. అందుకే మీరు చూడండి.. బాగా సన్నగా వాళ్లు చాలా ఎక్కువ ఫుడ్ తింటారు. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు మన శరీరానికి చక్కగా అందవు. దీంతో మన శరీరంలో పోషకాహార లోపం తలెత్తుతుంది. పోషకాలు లోపించడం వల్ల ఆ ప్రభావం మన చర్మం, జుట్టు, కళ్లు, మెదడు వంటి ఇతర అవయవాలపై కూడా పడుతుంది.

జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్తి, ఆకలిలేకపోవడం, గ్యాస్, మలబద్దకం, ఎసిడిటి, ఉబ్బసం, కడుపులో మంట, చర్మంపై మొటిమలు, నిద్రపట్టకపోవడం, ఫైల్స్, కీళ్ల నొప్పులు వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా మన జీర్ణవ్యవస్థను చురకుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేసే ఆ చిట్కాలు ఏంటంటే..
ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడిని, అర టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పెరుగును రోజూ భోజనం చేసిన తరువాత తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.
భోజనం చేసిన సోంపు గింజలను తినడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉన్నవారు సోంపు గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అజీర్తి సమస్యతో బాధపడే వారు భోజనానికి ముందు ఒక కప్పు నీళ్లల్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో పసుపు వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్ర చక్కగా పట్టడంతో పాటు మన కడుపు కూడా శుభ్రపడుతుంది.
ఈ చిట్కాలను పాటించడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఏది తిన్నా త్వరగా జీర్ణం అవుతుంది. !