నీళ్లల్లో దీన్ని కలుపుకొని తాగితే ఆయుష్షు పెరుగుతుందా?

ఆ రోజుల్లో 50 ఏళ్లు దాటినా ఎవరు ఆసుపత్రులకు వెళ్లరు.. ఇప్పుడు పురిటి బిడ్డకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఆరోగ్యం పై ఎవరికీ శ్రద్ద లేదు.. డబ్బులను సంపాదించాలనే పిచ్చితో కడుపుకు తినడమే మానేశారు..ఒకప్పుడు దెబ్బ తగిలితే

నీళ్లల్లో దీన్ని కలుపుకొని తాగితే ఆయుష్షు పెరుగుతుందా?


ఆ రోజుల్లో 50 ఏళ్లు దాటినా ఎవరు ఆసుపత్రులకు వెళ్లరు.. ఇప్పుడు పురిటి బిడ్డకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఆరోగ్యం పై ఎవరికీ శ్రద్ద లేదు.. డబ్బులను సంపాదించాలనే పిచ్చితో కడుపుకు తినడమే మానేశారు..ఒకప్పుడు దెబ్బ తగిలితే పసుపు పెట్టి పసరు కట్టు కట్టే వారు. కానీ ఇప్పుడు దెబ్బ తగిలితే చిన్నదైనా పెద్దది అయినా కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆసుపత్రికి పరిగెత్తాల్సిందే. ఇలా చేయడం వల్ల మనుషులు చాలా సున్నితం అవుతున్నారు. అలాంటి సున్నిత మనస్కులు పెద్ద అనారోగ్యం బారిన పడ్డ సమయంలో మరింత టెన్షన్‌ పడుతూ ఉంటారు. కనుక అనారోగ్యం జోలికి వెళ్లకుండా శరీరంను దూరంగా ఉంచాలంటే పసుపును వాడాలి.. ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Start your day with Turmeric water and say hi to beautiful s

ప్రతి ఒక్కరు కూడా పసుపు నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం ను మెరుగు పరుచుకోవచ్చు. పసుపు వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... అజీర్తి మరియు మలబద్దకంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు ఎలాంటి ఉన్నా కూడా పసుపులో ఉన్న యాంటీ బయోటిక్స్ గుణాలు పరిష్కారం చూపిస్తుంది. ప్రతి రోజు వేడి నీళ్లలో పసుపు వేసుకొని పరగడుపున తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మొత్తం కూడా కేవలం నెల రోజుల గ్యాప్‌ లోనే తగ్గి పోతాయని నిపుణులు చెబుతున్నారు... ఈ నీళ్ల వల్ల మలబద్దక సమస్యలు కూడా వెంటనే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు..


చర్మ సంబంధిత సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గోరు వెచ్చని పసుపు నీటిని ప్రతి రోజు ఉదయాన్నే తాగడం వల్ల ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా చర్మం పొడిబారిపోయి పొరలు పొరలుగా లేస్తున్న వారికి పసుపు నీటి వల్ల ప్రయోజనం కలుగుతుంది. పసుపు వల్ల చర్మంలో మళ్లీ జీవం వస్తుంది. ఉన్న చర్మం కూడా సాఫ్ట్‌ గా అందంగా తయారు అవుతుంది. మద్యం ఎక్కువ తాగే వారికి కాలేయం చెడిపోతుంది. అలాంటి వారికి కూడా పసుపు నీళ్లు మంచి ప్రయోజనం ను చేకూర్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకుగాను పసుపు నీళ్లు ప్రయోజనకరంగా పని చేస్తాయి.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..  ఎటువంటి రోగాలు రావు దాంతో ఆయుష్షు పెరుగుతుందని చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికైనా ఈ టిప్ ను ఫాలో అవ్వండి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.