గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్...వెన్నలా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గుండె పోటుతో చనిపోతున్న సంగతి తెలిసిందే..ఇక ఈ సమస్యలు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే పరిణమిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవడం

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్...వెన్నలా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది..


ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గుండె పోటుతో చనిపోతున్న సంగతి తెలిసిందే..ఇక ఈ సమస్యలు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగానే పరిణమిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో కొన్ని రకాల ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవడం ద్వారా హృదయ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఈ హృదయ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండెను కాపాడే  ఇప్పుడు తెలుసుకుందాం....


యాపిల్‌లో పుష్కలంగా ఉండే పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో మెటబోలిజం స్థాయిని పెంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దోహదపడతాయి..

ఆరెంజ్, నిమ్మలను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ వేగంగా కరుగుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించగలవు..

బొప్పాయి కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ చాలా వేగంగా కరుగుతుంది. బొప్పాయితో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రణలో ఉంటుంది..

కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు పియర్‌లో ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీ గుండెను కాపాడగలుగుతుంది. ఇంకా ఇందుకలో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

గుండె ఆరోగ్యాన్ని కాపాడే పండ్లలో ద్రాక్ష ప్రముఖమైనది. ద్రాక్షలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి. తద్వారా గుండెను రక్షించుకోవడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.