బాలింతలకు పాలు బాగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..

పుట్టిన బిడ్డకు తల్లి పాలను మించిన ఆరోగ్యం ఇంకోటి ఉండదు. ఎవరైతే చిన్నప్పుడు తల్లిపాలనే ఎక్కువగా తాగుతారో.. వారికి భవిష్యత్తులో రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజుల్లో వివిధ కారణాల వల్ల పిల్లలకు ప్యాకెట్‌ పాలను ఇస్తుంటారు.. బాలింతలకు పాలు ఉండటం లేదని వైద్యులు చెప్తున్నారు.

బాలింతలకు పాలు బాగా పెరగాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..


పుట్టిన బిడ్డకు తల్లి పాలను మించిన ఆరోగ్యం ఇంకోటి ఉండదు. ఎవరైతే చిన్నప్పుడు తల్లిపాలనే ఎక్కువగా తాగుతారో.. వారికి భవిష్యత్తులో రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈరోజుల్లో వివిధ కారణాల వల్ల పిల్లలకు ప్యాకెట్‌ పాలను ఇస్తుంటారు.. బాలింతలకు పాలు ఉండటం లేదని వైద్యులు చెప్తున్నారు. పాలు పట్టేందుకు మందులు వాడుతున్న తల్లులు కూడా ఉన్నారు. ఎలాంటి మందులు వాడకుండా.. బాలింతలకు పాలు పట్టాలంటే.. కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి అవేంటో చూద్దామా..!
Our Top 19 Breastfeeding Tips | Pampers
ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ మెంతులను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో ఒక టీస్పూన్‌ తేనెను కలిపి తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే బాలింతల్లో పాలు బాగా పెరుగుతాయి. మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్‌ పాలను బాగా ఉత్పత్తి చేస్తుంది.
మునగకాయలను శుభ్రం చేసి వాటిపై ఉండే పొట్టు తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి. దాన్ని అర కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
బాలింతల్లో పాలు ఉత్పత్తి అయ్యేందుకు సోంపు గింజలు కూడా బాగా పనిచేస్తాయి. ఇందుకు గాను ఒక పాత్రలో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. అనంతరం వడకట్టి ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయాలి. పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
వెల్లుల్లిలో లాక్టోజెనిక్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి బాలింతల్లో పాలను పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి నేరుగా తినాలి. లేదా ఆహారంలో చేర్చుకుని తినవచ్చు.
పాలు బాగా లేని తల్లులకు దాల్చిన చెక్క కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో డికాషన్‌ తయారు చేసుకుని తాగాలి. లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో పాలు ఉత్పత్తి అవుతాయి.
బాదం పప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. రోజూ నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తిన్నా.. లేదా బాదం పాలు తాగినా బాలింతల్లో పాలు పెరుగుతాయి.
బాలింతలు ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలి. స్తనాలను రోజూ సున్నితంగా మర్దనా చేయాలి. బిగుతైన లో దుస్తులు ధరించరాదు. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాలు బాగా పడతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.