మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటింట్లో ఉండే వీటిని రోజూ తీసుకోవాలి..

వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీ సమస్యలతో పోరాడుతున్నారు.. బిపి, షుగర్ వంటి వ్యాదులు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.. అయితే ప్రతి వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటింట్లో ఉండే వీటిని రోజూ తీసుకోవాలి..


వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీ సమస్యలతో పోరాడుతున్నారు.. బిపి, షుగర్ వంటి వ్యాదులు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.. అయితే ప్రతి వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి..మన శరీరంలోని మలినాలను మూత్రపిండాలే బయటకు పంపుతాయి. ఇవి దెబ్బతింటే మన శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోయి ఎన్నో రోగాలు వస్తాయి. అయితే మన మూత్రపిండాలు ఎన్నో కారణాల వల్ల దెబ్బతింటాయి. అంతేకాదు పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వాడినా కూడా కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కొన్నిసార్లు కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మూత్రం లేదా కిడ్నీలలో రాళ్లు అలాగే వాటి పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి.. వీటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు ఏంటో, ఎలా వాడాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం..

అల్లం దగ్గు, జలుబు, వైరల్ జ్వరం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే అల్లం కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంతో పాటుగా వెల్లుల్లి కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది..

ఉల్లిగడ్డలో ఎన్నో రోగాలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. ఉల్లిపాయ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే ఉల్లిపాయను ప్రతి కూరలో వేసుకుని తినండి. ఉల్లి మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. పసుపుకు కర్కుమిన్ అనే రసాయనమే రంగును ఇస్తుంది. ఇది మనం ఎన్నో వ్యాధుల నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పసుపును డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం కూడా బాగుంటుంది. పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు..

రెడ్ క్యాప్సికమ్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి..

కిడ్నీల వ్యాధితో బాధపడేవారు ఆలివ్ ఆయిల్ ను వాడితే మంచిది. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి...

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.