రక్తనాళాల్లో పేరుకుపోయిన మలినాలతో గుండెకు ప్రమాదమే

పిండంలో ఉన్నప్పుడు గుండె ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో... ఆ క్షణం నుంచి గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. విరామం, విశ్రాంతి, విసుగు ఇలాంటివి ఏవీ లేకుండా తనపని తానూ చేసుకుంటూ పోతుంది.. అంత ముఖ్యమైన అవయవాని

రక్తనాళాల్లో పేరుకుపోయిన మలినాలతో గుండెకు ప్రమాదమే


పిండంలో ఉన్నప్పుడు గుండె ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో... ఆ క్షణం నుంచి గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. విరామం, విశ్రాంతి, విసుగు ఇలాంటివి ఏవీ లేకుండా తనపని తానూ చేసుకుంటూ పోతుంది.. అంత ముఖ్యమైన అవయవానికి శరీరంలో కొవ్వు అనే శత్రువు తయారవుతుంది. దాన్ని దాటుకుని గుండె తన పని చేసుకోవడానికి ఎంతో పోరాడుతుంది.. హైలెట్‌ ఏంటంటే.. ఈ గుండె ఏ దేహం కోసం అయితే పోరాడుతుందే ఆ దేహం కూడా తనకు శత్రువే.. అడ్డమైన ఆహారాలు అన్నీ తినేసి.. వ్యర్థాలు, కొవ్వులు, మలినాలు పేరుకుపోయేలా చేస్తాం.. దానివల్ల గుండెకే కదా ఇబ్బంది.. మరి గుండె ఆరోగ్యం బాగుండాలంటే.. రక్తనాళాల్లో మలినాలు ఉండొద్దు.. దానికోసం మనం ఏం చేయాలి, ఏం తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..!

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తుండాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే కొందరికి రక్త నాళాల్లో ప్లేక్‌ (plaquе) పేరుకుపోతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. రక్తనాళాలు వాపులకు గురవుతాయి. ఫలితంగా హార్ట్‌ ఎటాక్‌లు వస్తాయి. రక్త నాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

రక్తనాళాల్లో మలినాలు పోవాలంటే..

రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ గ్రీన్‌ టీని తాగాలి. గ్రీన్‌ టీలో కాటెకిన్స్, ఫినాల్స్ అనబడే సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా చూస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు.

ఆలివ్‌ ఆయిల్‌ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. రోజూ ఆలివ్‌ ఆయిల్‌ను వాడే వారికి హార్ట్‌ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 41 శాతం వరకు తగ్గుతాయి. అందువల్ల రోజూ ఆలివ్‌ ఆయిల్‌ను వాడడం మంచిది.

పాలకూరలో ఫైబర్‌, పొటాషియం, ఫోలేట్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాలు వాపులకు గురికాకుండా ఉంటాయి. రోజూ పసుపుతో తయారు చేసిన డికాషన్‌ను తాగాలి. లేదా రాత్రిపూట గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగాలి. దీంతో గుండెను సంరక్షించుకోవచ్చు.

రోజుకో యాపిల్‌ పండును తింటున్నా రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.

ఇప్పుడు చెప్పండి పైన చెప్పిన వాటిల్లో మీరు పాటించేవి ఒక్కటైనా ఉన్నాయా..? లేకపోతే ఇకనైనా అలవాటు చేసుకోండి మరీ..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.