Protein To Vegetarians : శాకహారులకు ప్రోటీన్స్ అందించే పదార్థాలు ఇవే..
Protein To Vegetarians : రోజు ఆహారంలో ప్రోటీన్లను భాగం చేసుకోవడం చాలా అవసరం.. అయితే చాలామంది మాంసాహారంలో మాత్రమే అధిక స్థాయిలో ప్రోటీన్లు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అయితే ఇది ఎంత మాత్రం..
Protein To Vegetarians : రోజు ఆహారంలో ప్రోటీన్లను భాగం చేసుకోవడం చాలా అవసరం.. అయితే చాలామంది మాంసాహారంలో మాత్రమే అధిక స్థాయిలో ప్రోటీన్లు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని శాకాహారుల సైతం అధిక ప్రోటీన్లు ఉండే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మాంసాహారులతో సమానంగా పోషకాలు అందుతాయని తెలుస్తోంది..
ప్రోటీన్స్ అధిక స్థాయిలో ఉండే ఆహార పదార్థాల్లో బాదంపప్పు కూడా ఒకటి దీనిని తరచూ తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువగా ఉండే ప్రోటీన్ త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది ముఖ్యంగా తరచు వ్యాయామం చేసేవారు వ్యాయామం అనంతరం దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఆకలి వేసినప్పుడు బాదంను తీసుకోవడం వల్ల అతిగా తినే సమస్య నుంచి బయటపడవచ్చు..
అంతేకాకుండా ఇది ఎముకల బలానికి ఎంతో బాగా పనిచేస్తుంది అలాగే దీనిలో ఉండే విటమిన్ ఇ శిరోజాల ఎదుగుదలకు కృషి చేస్తుంది..
అలాగే పన్నీర్, చీజ్ లో కూడా ప్రోటీన్లు అధిక స్థాయిలో ఉంటుంది కొందరు వీటిని తినటానికి ఇష్టపడరు ఇలాంటి వాళ్ళు టోఫూను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇందులో ఉండే ఫాస్ఫరస్ ఐరన్ కాల్షియం మాంగనీస్ వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా ఈ ఆహార పదార్థాన్ని ఎలాంటి వారైనా ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు ఇది చూడటానికి మాత్రం అచ్చం పన్నీరు లానే కనిపిస్తుంది..
అలాగే శాకాహారులకు మరొక ముఖ్యమైన ఆహార పదార్ధం పప్పులో చాలా రకాలు ఉంటాయి అన్నిటిలో కూడా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే తరచూ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్స్ అందుతాయి అలాగే పప్పును రోజు మొత్తంగా ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు..
అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పాలకూర వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.. అలాగే సిట్రస్ జాతి పండ్లతో శరీరం చురుకుగా మారుతుంది.. వీటితో పాటు పాలు, పాలు సంబంధిత పదార్థాలను సైతం తీసుకోవడం వల్ల కాల్షియం లోపం రాకుండా ఉంటుంది.. స్వచ్ఛమైన నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. అలాగే చిరుధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ ను నిత్యం తీసుకుంటూ ఉండాలి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి అలాగే గోధుమ గోధుమలతో చేసిన రొట్టెలు తీసుకుంటూ ఉండాలి.. వీటన్నిటి వల్ల శాకాహారులకు పోషకాహార లోపం లేకుండా ఉండటమే కకుండా ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది..