అతి శృంగారం మంచిదా? కాదా?

చాలా మంది శృంగారం అనగానే అది చీకటి వ్యవహారంగా....భావిస్తారు. శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే...దానిని ఎలా చేస్తే ఆస్వాదిస్తామో కొందరికి తెలియదు.  రాత్రిపూట సెక్స్ చేయడానికి కొందరు అయిష్టంగా ఉంటారు.

అతి శృంగారం మంచిదా? కాదా?


చాలా మంది శృంగారం అనగానే అది చీకటి వ్యవహారంగా....భావిస్తారు. శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే...దానిని ఎలా చేస్తే ఆస్వాదిస్తామో కొందరికి తెలియదు.  రాత్రిపూట సెక్స్ చేయడానికి కొందరు అయిష్టంగా ఉంటారు. ఒక్కోసారి ఓపిక కూడా ఉండదు... రాత్రిపూటల్లో చేయడం వల్ల నిద్రాభంగం జరగడమే కాకుండా....శారీరక ఒత్తిడి వల్ల పొద్దున్న చికాకుగా ఉంటుంది.

New Research Finds High Levels of Trust, Low Levels of Jealousy in  Consensual Open Relationships

అదే...దాని స్థానంలో ఉదయపు శృంగారాన్ని అలవాటు చేసుకుంటే చాలా ఆనందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం శృంగారం వల్ల చాలా లాభాలు ఉంటాయి. టెస్టోస్టిరాన్ స్థాయిలు తరచుగా పురుషులు , మహిళలు ఇద్దరికీ ఉదయాన్నే ఎక్కువగా ఉంటాయి, ఇది లైంగిక కోరికను పెంచుతుంది. ఇద్దరు భాగస్వాములు ఉద్రేకానికి గురవుతారు. కలయిక కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది.
పని ఒత్తిడి, అలసట కారణంగా
ఉదయం పూట చేసేటప్పుడు ఇద్దరు ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎక్కువ శక్తి ఉపయోగించడం వల్ల మరింత ఆనందాన్నిస్తుంది. దానికారణంగా మానసికంగా, శారీరకంగా సుఖం అనుభవించవచ్చు. మంచి నిద్ర అలవాట్లకు ప్రాధాన్యతనిచ్చే వారికీ బాగా విశ్రాంతిగా మేల్కొనే వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. శక్తి ఎక్కువగా ఉంటే సెక్స్ మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.

దాదాపు ఈ రోజుల్లో జంటలకు ప్రశాంతమైన సమయం దొరకడం లేదు. రాత్రిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగం, వ్యాపార ఒత్తిడి మొత్తం ఇంటికి మోసుకువస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కలయికలో పాల్గొనాలనే కోరిక కూడా కలగదు. కానీ.. ఉదయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. పని మొదలు కావడానికి ముందే.. దంపతులు ఏకాంతంగా గడపడానికి కాస్త సమయం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం ద్వారా రోజును ప్రారంభించినట్లయితే తప్పేమీ లేదు. దానివల్ల మీరు చాలా సంతోషంగా, సానుకూలంగా , మంచి అనుభూతి చెందుతారు.
అందువల్ల రోజును ఉత్సాహంగా ప్రారంభించడంలో సహాయపడతాయి.

ఇంకో విషయం ఇద్దరి శారీరక సంబంధం బాగుండాలంటే.......దంపతుల మధ్య ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి.

సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం. అప్పుడే శారీరక బంధం కూడా బలపడుతుంది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.