గుండె వేగంగా కొట్టుకుంటుందా..? రక్తహీనత కారణం కావొచ్చు.. 

మనకు ఉన్న అవయవాల్లో గుండె చాలా ముఖ్యమైనది.. మొత్తం ఇక్కడి నుంచే ప్రాసెస్‌ స్టాట్‌ అవుతుంది. గుండె కొట్టుకుంటుంటే ర‌క్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు స‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రి గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మ‌నిషి గుండె

గుండె వేగంగా కొట్టుకుంటుందా..? రక్తహీనత కారణం కావొచ్చు.. 


మనకు ఉన్న అవయవాల్లో గుండె చాలా ముఖ్యమైనది.. మొత్తం ఇక్కడి నుంచే ప్రాసెస్‌ స్టాట్‌ అవుతుంది. గుండె కొట్టుకుంటుంటే ర‌క్తం పంప్ అవుతుంటుంది. ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు స‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 వ‌ర‌కు ఉంటుంది. కానీ కొంద‌రి గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది. మ‌నిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవ‌డం స‌హ‌జ‌మే. కానీ 100 క‌న్నా ఎక్కువ సార్లు ఎల్ల‌ప్పుడూ కొట్టుకుంటూ ఉంటే అది మంచిది కాదు. ఏదో అనారోగ్య స‌మ‌స్య ఉన్న‌ట్లు అర్థం..వైద్య ప‌రిభాష‌లో దీన్నే టాకీకార్డియా అంటారు.

భ‌యం క‌లిగిన‌ప్పుడు, ఒత్తిడికి గురైన‌ప్పుడు, శారీర‌క శ్ర‌మ చేసిన‌ప్పుడు, వ్యాయామం చేసిన స‌మ‌యంలో, ప‌రుగెత్తినా.. న‌డిచినా.. కొండ ప్రాంతం, మెట్లు ఎక్కినా.. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. స‌మ‌యాల్లో స‌హ‌జంగానే గుండె కొట్టుకునే వేగం ఎక్కువ‌గా ఉంటుంది. కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. కానీ ఎల్ల‌ప్పుడూ గుండె వేగంగానే కొట్టుకుంటుంటే.. అంటే.. 100 సార్ల‌కు పైగా నిమిషానికి గుండె కొట్టుకుంటుంటే.. అప్పుడు మీకు ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు భావించాలి.

కారణాలు..

ఇక శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ మరీ త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, లో బీపీ ఉన్న‌ప్పుడు, జ్వ‌రం, ర‌క్త‌హీన‌త‌, డీహైడ్రేష‌న్ ఏర్ప‌డిన‌ప్పుడు, గ‌ర్భిణీల‌కు లేదా మ‌హిళ‌ల‌కు నెల‌సరి స‌మ‌యంలో, మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల‌, టీ, కాఫీల‌ను లేదా పొగ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల‌, డ్ర‌గ్స్ వాడ‌కం, ఇత‌ర మందుల వాడ‌కం వ‌ల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరిగి అలాగే కొన్ని రోజుల త‌ర‌బ‌డి ఉంటే.. దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే అది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయ‌వ‌చ్చు. లేదా హార్ట్ ఎటాక్‌, కొరొన‌రీ ఆర్ట‌రీ డిసీజ్‌, ఆట్రియ‌ల్ ఫైబ్రిలేష‌న్ వంటి స‌మ‌స్య‌లు రావ‌చ్చు. ఈ క్ర‌మంలోనే గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకునే వారు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లవ‌డం ఉత్త‌మం.
గుండెకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. అస్సలు లైట్‌ తీసుకోకూడదు.. మిగతా ఏ సమస్యను అయినా ఇవ్వాళ కాకపోతే రేపు అని లైట్‌ తీసుకోవచ్చు.. కానీ గుండెకు సంబంధించి చిన్న ఇష్యూ ఉన్నా అస్సలు అశ్రద్ధ చేయకూడదు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.