పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే మంచిది..!

పాలు ఇచ్చే తల్లులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. పాలిచ్చే తల్లులు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల శిశువుకు కూడా మేలు కలుగుతుంది.

పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే మంచిది..!


పాలు ఇచ్చే తల్లులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు. పాలిచ్చే తల్లులు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల శిశువుకు కూడా మేలు కలుగుతుంది. అందుకనే ఆహారం విషయంలో తప్పక శ్రద్ధ తీసుకోవాలి.

10 Moms' Hacks for Making Mealtime With a Toddler Easier | CafeMom.com

డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అల్లం పసుపు, ఇటువంటివన్నీ కూడా పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి..?, దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

బీన్స్:

కిడ్నీ బీన్స్, బఠాణి వంటివి తీసుకుంటే పాలిచ్చే తల్లులకు ఎటువంటి సమస్యలు రావు. అలానే ఆరోగ్యంగా ఉంటారు.

ఆకుకూరలు:

ఆకుకూరలు కూడా పాలిచ్చే తలలు తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లికి ఇబ్బందులు కలగవు. అలానే క్యాబేజీ, బ్రోకలీ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

గింజలు:

పాలిచ్చే తల్లులు గింజలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. వీటిలో ప్రోటీన్, జింక్, ఐరన్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా చియా సీడ్స్, ఫ్లెక్ సీడ్స్ కూడా మేలు చేస్తాయి.

పసుపు:

పాలిచ్చే తల్లులు పసుపు తీసుకోవడం కూడా మంచిదే ఆహారాన్ని వండేటప్పుడు కొద్దిగా పసుపు వేసి వండుకుంటే సమస్యలు రావు. వాల్ నట్స్ కూడా పాలిచ్చే తల్లికి మేలు చేస్తాయి కాబట్టి వీటిని తీసుకుంటూ ఉండండి తద్వారా ఏ ఇబ్బంది లేకుండా ఉండండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.